Site icon NTV Telugu

Illegal Affair: భర్త లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య.. చివరకు ఏమైందంటే.?

Illegal

Illegal

Illegal Affair: వివాహేతర సంబంధాలు సంబంధించిన విషయాలు నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. తాజాగా అలాంటి ఓ సంఘటన కాకినాడలో చోటుచేసుకుంది. భర్త ఇంట్లో లేని సమయంలో ప్రియుడిని ఇంటికి పిలిపించుకున్న భార్య బాగోతాన్ని భర్త స్వయంగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.

Read Also: iQOO Neo10 Pro+: 7000mAh బ్యాటరీ, 2K OLED డిస్‌ప్లేతో విడుదలకాబోతున్న iQOO నియో10 ప్రో+..!

లక్ష్మణ్ అనే వ్యక్తి రొయ్యలు, చెరువుల నిర్వహణతో జీవనం సాగిస్తున్నాడు. రాత్రి వేళల్లో వారి చెరువుల దగ్గరకు వెళ్లి అక్కడే పడుకునే అలవాటు ఉంది. ఇకపోతే, అతని భార్య నాగమణి గతంలో ఓ ప్రైవేట్ కాలేజీలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేసింది. ఆ సమయంలో అదే కాలేజీలో చదువుతున్న మణికంఠ అనే యువకుడితో ఆమెకు వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇది ఇలా ఉండగా.. ఎప్పటిలాగానే సోమవారం రాత్రి కూడా లక్ష్మణ్ చెరువుల వద్దకు వెళ్లాడు. అయితే, కరెంట్ లేకపోవడం వల్ల అతను అనుకోకుండా తిరిగి ఇంటికి వచ్చాడు. ఇక అర్ధరాత్రి సమయంలో ఇంటి తలుపులు తీసుకుని లోపలికి వెళ్లగా.. తన భార్య నాగమణి మణికంఠతో కలిసి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యాడు.

Read Also: Sandeep Kumar Sultania: రాష్ట్ర ఆర్ధిక శాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ కుమార్ సుల్తానియా..!

ఆ సమయంలో కోపంతో ఊగిపోయిన లక్ష్మణ్.. అందులో నుంచి తేరుకొని వెంటనే ఇంటి తలుపులను బయట నుంచి లాక్ చేసాడు. ఆ తర్వాత పోలీసులు, చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేశాడు. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నాగమణి, మణికంఠను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Exit mobile version