Ileana : తన పెళ్లి పై ఆసక్తికర కామెంట్స్ చేసిన ఇలియానా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గోవా బ్యూటీ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.టాలీవుడ్ లో ఈ భామ స్టార్ హీరోయిన్ గా రానించింది. ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్ళింది. అక్కడ ఈ భామ వరుస సినిమాలు చేసిన కూడా టాలీవుడ్ లో వచ్చినంత గుర్తింపు రాలేదు.దీనితో ఈ భామకు సినిమా ఆఫర్స్ తగ్గిపోయాయి.కొన్నాళ్లుగా ఈ భామ సినిమాలకు దూరంగా ఉన్నా.. గతేడాది ఆగస్ట్ 1న పెళ్లి చేసుకోకుండానే బిడ్డకు జన్మనిచ్చి వార్తల్లో నిలిచింది.అయితే ఆ తర్వాత అయినా ఆమె తన పార్ట్నర్ మైఖేల్ డోలాన్ ను పెళ్లి చేసుకుందా లేదా అన్నది మాత్రం తెలియలేదు.తల్లి అయిన తర్వాత ఇలియానా పెళ్లి చేసుకుందని వార్తలు వచ్చాయి. తాజాగా టైమ్స్ ఆఫ్ ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన పెళ్లి వార్తలపై స్పందించింది. ఆ విషయాన్ని కాస్త సీక్రెట్ గానే ఉంచాలని అనుకుంటున్నట్లు ఆమె చెప్పుకొచ్చింది.
ఇలియానా ప్రస్తుతం మైఖేల్ డోలాన్, తన కొడుకు కోవా ఫీనిక్స్ డోలాన్ తో కలిసి అమెరికాలో ఉంటోంది.ఆగస్ట్ లో ఆమె బిడ్డకు జన్మనిచ్చినా.. అంతకుముందు మే నెలలోనే బాయ్‌ఫ్రెండ్ మైఖేల్ డోలాన్ ను పెళ్లి చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై తాజా ఇంటర్వ్యూలో ఆమె స్పందించింది. “దీనిపై చాలా పుకార్లు వచ్చాయి. దీనిని వాటికే వదిలేద్దాం. కాస్త మిస్టరీ ఉండటం కూడా బాగుంటుంది కదా. నా జీవితంలోని ఈ భాగం గురించి నేను పెద్దగా మాట్లాడదలచుకోలేదు.నా రిలేషన్షిప్ గురించి గతంలో చెప్పాను. దాని గురించి చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుకున్నారు. నా గురించి ఏది మాట్లాడినా కూడా నేను పట్టించుకోను. కానీ నా పార్ట్నర్ గురించి లేదా ఫ్యామిలీ గురించి మాట్లాడితే మాత్రం నాకు బాగా అనిపించదు” అని ఇలియానా స్పష్టం చేసింది.ఇక ఇదే ఇంటర్వ్యూలో తల్లి అయిన తర్వాత అందరు ఆడవాళ్లు ఎదుర్కొనే మానసిక, శారీరక సమస్యలపైనా ఇలియానా స్పందించింది. అమ్మతనం అనుభవించిన తర్వాత డిప్రెషన్ నిజమే అని ఆమె స్పష్టం చేసింది. అయితే ఈ దశలో తన పార్ట్నర్ మైఖేల్ డోలాన్ తనకు ఎంతో అండగా నిలిచాడని, అతడో అద్బుతమైన పార్ట్నర్ అని ఇలియానా చెప్పుకొచ్చింది.
Also Read
- Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
- Fatima Sana: మహిళల క్రికెట్లో అరుదైన రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.!
- Astrology: మే 16 శనివారం దినఫలాలు.. ఈ రాశివారికి అనుకోని ధన లాభం...!
- Shocking Love Story: ముసలోడికి దసరా పండగ.. 22 ఏళ్ల యువతితో పెళ్లి చేసిన గ్రామస్తులు..
తాజావార్తలు
-
Dubai: విమానంలో ఫోటోలు తీస్తే 10 ఏళ్ల జైలా? దుబాయ్ కోర్టు సంచలన తీర్పు..
-
Fatima Sana: మహిళల క్రికెట్లో అరుదైన రికార్డు.. 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ.!
-
Quadruplet Delivery: అరుదైన ఘటన.. 5 రోజుల వ్యవధిలో నలుగురు శిశువులకు జన్మనిచ్చిన మహిళ
-
Peddi: ముంబై వేదికగా..‘పెద్ది’ Vs ‘డ్రాగన్’ క్లాష్
-
CSK Playoff Chances: ఇక మిగిలింది రెండు మ్యాచ్‌లే.. చెన్నై ప్లేఆఫ్స్ చేరుతుందా? సమీకరణాలు ఇవే..
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..