IG Satyanarayana : వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ముమ్మాటికీ కుట్ర కోణం దాగి ఉందని ఐజీ సత్యనారాయణ అన్నారు. ఇవాళ NTVతో మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కలెక్టర్‌పై దాడి చేసిన 16 మందిని రిమాండ్ చేశామని, 55 మంది అనుమానితులను విచరించామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఎవరి ప్రోత్బలంతో కలెక్టర్‌పై దాడి చేశాడు అతని బాక్ గ్రౌండ్ ఏంటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు. ఈ కేసులో ఎంతటి వారినైనా వదిలిపెట్టమని, ప్రభుత్వం పోలీస్ శాఖ సీరియస్ గా ఉందని ఆయన అన్నారు. ఈ ఘటనలో పోలీసులు వైఫల్యం ఎక్కడ లేదని, ఇప్పటికే మూడు నాన్ బెయిల్ బుల్ కేసులు నమోదు చేసామన్నారు ఐజీ సత్యనారాయణ. గత కొన్ని వారాలుగా భూ సేకరణ కోసం అధికారులు సమయాత్తం అవుతున్నారని, ప్రధాన నిందితుడు సురేష్ కావాలని కలెక్టర్ ను మాయమాటలు చెప్పి గ్రామం లోకి తీసుకొని వెళ్లారన్నారు.
Starlink: భారత్‌లో త్వరలో స్టార్‌లింక్..? జియో, ఎయిర్‌టెల్‌పై ఎఫెక్ట్..
సానుకుల దృకతం తో కలెక్టర్ గ్రామం లోకి వెళ్లారని ఆయన తెలిపారు. అంతేకాకుండా.. కలెక్టర్ వెళ్లే లోపే అక్కడ ముందస్తు గా కర్రెలు, రాళ్ల తో దాడులు చేసారని, పోలీస్ శాఖ ఎవ్వరిని వదిలి పెట్టేది లేదన్నారు. సురేష్ వెనుక ఉన్న అసలు సూత్ర దారులు ఎవ్వరూన్న వదిలిపెట్టేది లేదని ఆయన ఉద్ఘాటించారు. సురేష్ కాల్ డేటా అంతా తీస్తున్నామని, త్వరలో అన్ని వివరాలు బయటకు వస్తాయన్నారు. ప్రస్తుతం సురేష్ పరారీ లో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని ఐజీ తెలిపారు. సోషల్ మీడియా లో రెచ్చ గొట్టే వాఖ్యలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.
CM Chandrababu: ఎమ్మెల్యేలకు సీఎం స్వీట్ వార్నింగ్..! అలా అయితే కష్టం..