రైస్ వాటర్ ప్రయోజనాల గురించి ఎవరికి పెద్దగా తెలియదు. ఈ వాటర్ చర్మానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. చాలా ఏళ్ల నుంచి చైనా, జపాన్ మహిళలు తమ జుట్టు పెరిగేందుకు, జుట్టును బలోపేతం చేయడానికి, తెల్ల వెంట్రుకలు రాకుండా ఉండేందుకు రైస్ వాటర్ ను ఉపయోగిస్తున్నారు. రైస్ వాటర్ లో జుట్టును ఆరోగ్యంగా ఉంచే ఎన్నో పోషకాలు ఉన్నాయి.
Read Also: Sankashti Chaturthi: సంకష్టహరచతుర్థి వేళ ఈ స్తోత్ర పారాయణం చేస్తే ధనప్రాప్తి, పుత్రప్రాప్తి
బియ్యం నీటిలో 75 నుంచి 80శాతం పిండి పదార్ధాలు ఉంటాయని సైన్స్ డైరెక్ట్ ప్రకారం వెల్లడైంది. బియ్యాన్ని నీటిలో నానబెట్టి ఉడికించిన తర్వాత ఈ పిండి పదార్థం వస్తుంది. అలాగే ఇందులో ఎన్నో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి జుట్టుకు ప్రయోజనకరంగా ఉంటాయి. దీనిలో అమైనో ఆమ్లాలు, బి విటమిన్లు, విటమిన్ ఈ, యాంటీఆక్సిడెంట్లు, మెగ్నీషియం, ఫైబర్, జింక్, మాంగనీస్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి.
Read Also: Vishnu stotra: ఈ స్తోత్రాలు వింటే ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి
బియ్యం నీటి వాడకం జుట్టు స్థితిస్థాపకతను నిర్వహించడానికి సహాయపడుతుంది అని ది విలే ఆన్లైన్ లైబ్రరీ ప్రచురించిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. డెర్మటాలజీ అండ్ థెరపీ 2019లో ప్రచురించిన ఒక సమీక్ష ప్రకారం.. విటమిన్ బి12 లేకపోవడం వల్లే జుట్టు తొందరగా రాలిపోతుందని తెలిపింది. కాబట్టి బియ్యం నీటిలో ఉన్న పోషకాలు జుట్టును బలోపేతం చేయడంతో పాటు.. వీటిలో ఉండే ఇతర పోషకాలు హేర్ ను ఆరోగ్యంగా ఉంచుతాయి.
Read Also: Wrestlers Talks: రెజ్లర్లను మరోసారి చర్చలకు పిలిచిన కేంద్రం
రైస్ వాటర్ లో కార్బోహైడ్రేట్.. ఇనోసిటాల్ ఉంటుంది. ఇది డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేస్తుంది. అలాగే జుట్టు పెరిగేందుకు హెల్ప్ చేస్తుంది. దీనిలోని పీహెచ్ స్థాయి జుట్టు పీహెచ్ స్థాయికి దగ్గరగా ఉండే ఛాన్స్ ఉంది. అందుకే ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుంది. బియ్యపు నీటిలో విటమిన్ బి, విటమిన్ ఈ పుష్కలంగా ఉంటాయి. ఇది జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది. ఇది మీ తల చర్మాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుతుంది. అలాగే చుండ్రును కూడా తగ్గించడానికి, జుట్టు ఆరోగ్యంగా పెరిగేందుకు ఎంతో సహాయపడుతుంది.
Read Also: World: ఈ ప్రపంచంలో ఎంతమందికి కరెంట్, వంటగ్యాస్ లేదో తెలుసా..?
బియ్యం నీటిని ఎలా తయారు చేసుకోవాలి అంటే..?
1. 1/2 కప్పు బియ్యాన్ని తీసుకుని బాగా శుభ్రం చేయండి. ఇప్పుడు బియ్యాన్ని రెండు మూడు సార్లు నీళ్లతో కడిగి నీళ్లలో వేసి ఒక గంట పాటు అలాగే వదిలేయండి. తర్వాత బియ్యం అలాగే ఉంచి ఒక గిన్నెలోకి నీటిని ఒంపండి. అంతే దీన్ని జుట్టుకు పెట్టుకోవచ్చు.
2. అరకప్పు బియ్యంలో 1 కప్పు నీళ్లు పోసి మరిగించండి. ఈ బియ్యాన్ని 10 నుంచి 15 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వండి. తర్వాత తరువాత బియ్యాన్ని, నీటిని వేరు చేయండి.
Read Also: Wtc Final: నేడే డబ్ల్యూటీసీ ఫైనల్ ఫైట్.. మరి ట్రోఫీ ఎవరిదో..?
పులియబెట్టిన లేదా సాదా బియ్యం నీరు.. ఏది ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుంది?
1.. పులియబెట్టిన బియ్యం నీరే ఎక్కువ ప్రయోజనకరంగా ఉంటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. 2012లో ఎండీపీఐ ప్రచురించిన ఒక అధ్యయనం ప్రకారం.. పులియబెట్టిన ఏదైనా పదార్ధంలో ఎక్కువ మొత్తంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలను పోగొడుతాయి. యాంటీఆక్సిడెంట్లు అన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ తయారీలో ఉపయోగిస్తారు అని తెలింది. పులియబెట్టిన బియ్యం తయారు చేయడానికి.. అర కప్పు బియ్యాన్ని 2 నుంచి 3 కప్పుల నీటిలో నానబెట్టి గది ఉష్ణోగ్రత వద్ద 2 రోజులు ఉంచండి. ఆ తర్వాత నీటిని వడకట్టి వాడుకోవచ్చు..
Read Also: Telangana School Education: 229 పని దినాలతో 2023-24 విద్యా సంవత్సరం
బియ్యం నీటిని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసా..?
1.. ముందుగా మీ జుట్టును షాంపూతో శుభ్రం చేయండి. ఇప్పుడు మీ జుట్టును బియ్యం నీటిలో ముంచండి. తర్వాత బియ్యం నీటితో తలకు మసాజ్ చేయండి. 20 నుంచి 25 నిమిషాల పాటు అలాగే ఉంచండి. ఇప్పుడు తేలికపాటి గోరువెచ్చని నీటితో జుట్టును క్లీన్ చేసుకోండి.
2.. జుట్టు బాగా పెరిగేందుకు, జుట్టును బలోపేతం చేయడానికి, వెంట్రుకలు తెగిపోకుండా ఉండేందుకు వారానికి ఒకటి లేదా రెండుసార్లు దీనిని జుట్టుకు ఉపయోగించాలి.. దీనిని లీవ్-ఇన్ కండీషనర్ గా కూడా ఉపయోగించుకోవచ్చు.