Site icon NTV Telugu

Team India: ఈరోజు ఆస్ట్రేలియాను ఓడిస్తే.. టీమిండియా నెంబర్ 1.. ఎందుకో తెలుసా..!

Team India

Team India

టీ20 క్రికెట్‌లో ఈరోజు టీమిండియా ఓ రికార్డు నెలకొల్పే సమయం వచ్చింది. ఈరోజు జరిగే మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై గెలిస్తే.. అత్యధిక టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు గెలిచిన రేసులో పాకిస్తాన్‌ను వెనక్కి నెడుతుంది. ప్రస్తుతం ఇండియా-పాకిస్తాన్ సంయుక్తంగా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో భారత్, పాకిస్తాన్‌లు 135-135 మ్యాచ్ ల్లో గెలుపొందాయి. ఈ క్రమంలో భారత్‌ పాకిస్తాన్ ను దాటి ముందడుగు వేసేందుకు ఈరోజు మంచి అవకాశం ఉంది. ఇప్పటి వరకు 226 టీ20 మ్యాచ్‌లు ఆడిన పాకిస్తాన్ 135 విజయాలను నమోదు చేయగా.. టీమిండియా కేవలం 212 మ్యాచ్‌ల్లోనే ఈ ఘనత సాధించింది. ఈ జట్ల తర్వాత న్యూజిలాండ్ 102 టీ20 ఇంటర్నేషనల్స్ గెలిచింది. ఆ తర్వాత.. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా జట్లు 95-95 విజయాలతో సంయుక్తంగా నాలుగో స్థానాన్ని ఆక్రమించాయి.

Read Also: Krishna Water Dispute: కృష్ణా జలాల వివాదం కేసు.. సుప్రీంలో విచారణ వాయిదా

ఇదిలా ఉంటే.. ఈరోజు రాయ్‌పూర్‌లో భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య నాల్గో టీ20 మ్యాచ్ జరగనుంది. షహీద్ వీర్ నారాయణ్ సింగ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. కాగా.. ఇప్పటి వరకు అక్కడ ఏ టీ20 అంతర్జాతీయ మ్యాచ్ జరగలేదు. అంతర్జాతీయ స్థాయిలో ఈ మైదానంలో ఒకే ఒక్క వన్డే మ్యాచ్ జరిగింది. ఈ ఏడాది ప్రారంభంలో భారత్, న్యూజిలాండ్ మధ్య ఈ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో కివీస్ జట్టు కేవలం 108 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 2 వికెట్లు కోల్పోయి సులువుగా లక్ష్యాన్ని ఛేదించింది. అయితే.. ఈరోజు జరిగే మ్యాచ్‌లోనూ బౌలర్లకు పిచ్ మరింత సహకరించే అవకాశం ఉంది.

Read Also: Seed Purification : విత్తన శుద్ధి చెయ్యడం వల్ల కలిగే లాభాలు ఏంటో తెలుసా?

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉంది. సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా విజయం సాధించగా.. మూడో టీ20లో గ్లెన్ మాక్స్‌వెల్ పేలుడు ఇన్నింగ్స్ తో టీమిండియా విజయాన్ని ఆస్ట్రేలియా కైవసం చేసుకుంది. అయితే.. ఈరోజు జరిగే మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించేందుకు ప్రయత్నిస్తుంది. ఈ మ్యాచ్‌లో భారత్ గెలుపొందితే.. సిరీస్ టీమిండియా సొంతం అవుతుంది. ఒకవేళ ఆసీస్ గెలుపొందితే.. ఆదివారం జరిగే మ్యాచ్ లో సిరీస్ ఎవరి వశం కానుందో తేలిపోతుంది.

Exit mobile version