NTV Telugu Site icon

Team India: టీమిండియా టెస్ట్ కెప్టెన్సీ నుంచి రోహిత్ ను తొలగిస్తే.. నెక్ట్స్ సారథి ఎవరు..?

Team India

Team India

డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భారత జట్టును విజేతగా నిలపడంలో విఫలమైన కెప్టెన్‌ రోహిత్‌ శర్మపై విమర్శలు పర్వం కురుస్తుంది. టెస్టుల్లో రోహిత్‌ కెప్టెన్‌గా పనికిరాడని.. అతన్ని కెప్టెన్సీ నుంచి తొలగించడం మంచిదని అభిప్రాయపడుతున్నారు. కెప్టెన్‌గా టెస్టు సిరీస్‌లు గెలిచినప్పటికి ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో జట్టును నడిపించడంలో విఫలం కావడంతోనే రోహిత్‌ను తప్పించాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.

Read Also : Andrapradesh : తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం..ఐదుగురు మృతి..

ఒకవేళ ఇప్పటికిప్పుడు రోహిత్‌ శర్మను టెస్టు కెప్టెన్సీ నుంచి తప్పిస్తే ప్రత్యామ్నాయం ఎవరనే దానికి ఎక్కువగా అజింక్యా రహానే పేరు వినిపిస్తుంది. 512 రోజుల విరామం తర్వాత టెస్టు మ్యాచ్‌ ఆడిన రహానే అందరికంటే మంచి ప్రదర్శన చేశాడు. అసలు రహానే లేకపోతే డబ్ల్యూటీసీ ఫైనల్‌ మూడు రోజుల్లోనే కాంప్లీట్ అయ్యేది. తొలి ఇన్నింగ్స్‌లో అతను ఆడిన 89 పరుగుల ఇన్నింగ్స్‌ టీమిండియా పరువు కాపాడడంతో పాటు మ్యాచ్‌ ఐదురోజులు జరగడానికి కారణమయింది.

Read Also : Kolkata Metro: కోల్‌కతా మెట్రోలో తప్పిన భారీ ప్రమాదం.. 2గంటలు నిలిచిన సేవలు

ఇక రోహిత్‌ స్థానంలో రహానే టీమిండియా టెస్టు కెప్టెన్‌గా సరైనోడని చాలా మంది క్రీడీ పండితులు అంటున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. 2020-21లో టీమిండియా ఆస్ట్రేలియాలో పర్యటించింది. తొలి టెస్టు ఓటమి తర్వాత అప్పటి రెగ్యులర్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి పెటర్నిటీ లీవ్స్‌ పేరిట స్వదేశానికి వెళ్లడంతో.. దీంతో వైస్‌ కెప్టెన్‌గా ఉ‍న్న రహానే.. తాత్కాలిక కెప్టెన్‌గా జట్టును ముందుండి నడిపించాడు. నడిపించడమే కాదు అటు బ్యాటర్‌గా.. ఇటు కెప్టెన్‌గా సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు.

Read Also : NHPC Limited Jobs: పది అర్హతతో 388 ఉద్యోగాలు..నెలకు రూ..1,19,500 జీతం..

అయితే గతంలో మెల్‌బోర్న్‌ టెస్టులో టీమిండియా గెలవడంలో రహానే కీలక పాత్ర వహించాడు. కెప్టెన్‌గా అతను తీసుకున్న నిర్ణయాలతో పాటు బ్యాటింగ్‌లో సెంచరీ చేయడంతో టీమిండియా రెండో టెస్టు గెలిచింది. ఇక సిడ్నీ వేదికగా జరిగిన మూడో టెస్టును భారత జట్టు డ్రా చేసుకుంది. ఇక.. గబ్బా వేదికగా జరిగిన చివరి టెస్టులో చారిత్రాత్మక విజయంతో పాటు 2-1తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో భవిష్యత్తు కెప్టెన్‌గా రహానే పేరు అప్పట్లో మార్మోగిపోయింది.

Read Also : Manchu Lakshmi : డిజైనర్ డ్రెస్ లో క్లివేజ్ షో చేస్తున్న మంచు లక్ష్మీ..

ఇప్పుడు రోహిత్‌ టెస్టు కెప్టెన్‌గా తరచూ విఫలం అవుతుండడంతో అతని స్థానంలో రహానే అయితేనే కరెక్ట్‌ అని చాలా మంది అనుకుంటున్నారు. అజింక్యా రహానేలో నాయకత్వ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయని.. జట్టు ఓటమి దిశగా ఉన్నప్పుడు సమయస్పూర్తితో వ్యవహరించి మ్యాచ్‌ను గాడిన పెట్టడం రహానేకున్న సమర్థత అని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పుడు కాకపోయినా రోహిత్‌ తర్వాతి టెస్టు కెప్టెన్‌ అజింక్యా రహానేనే అవుతాడని అభిమానులు అనుకుంటున్నారు.