NTV Telugu Site icon

S.V.Madhav Reddy SP: అల్లర్లు సృష్టిస్తే జిల్లా బహిష్కరణ, కఠిన చర్యలు తప్పవు

New Project (29)

New Project (29)

ఎన్నికల పోలింగ్ అనంతరం రాష్ట్రంలో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో పటిష్టమైన చర్యలు తీసుకున్నట్లు సత్యసాయి జిల్లా ఎస్పీ మాధవరెడ్డి వెల్లడించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎలక్షన్ రోజు జరిగిన గొడవల్లో ఇప్పటికే 10 మందిని జైలుకు పంపడం జరిగిందని స్పష్టం చేశారు. జిల్లాలో అల్లర్లు సృష్టిస్తే జిల్లా బహిష్కరణతో పాటు కఠిన చర్యలు తప్పవుని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు పెట్రోల్ బంకులు, కిరాణా షాపుల్లో లూజ్ పెట్రోల్ విక్రయాలు చేపట్టకూడదని ఆదేశించినట్లు చెప్పారు.

READ MORE: MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు దక్కని ఊరట.. మరోసారి రిమాండ్ పొడిగింపు

నిబంధనలు ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తప్పవని ఎస్పీ మాధవరెడ్డి పునరుద్ఘాటించారు. ఫైర్ క్రాకర్స్ అక్రమ నిలువలపై దృష్టి సారించామన్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో గొడవలు సృష్టించిన వారిని ఇప్పటికే గుర్తించి బైండోవర్ చేస్తున్నామని తెలిపారు. కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీ నాయకులు ఎటువంటి ర్యాలీలు నిర్వహించకూడదని స్పష్టం చేశారు. కాగా ఈసారి అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలోని పలు చోట్ల అల్లర్లు చెలరేగాయి. ఈ హింసాత్మక ఘటనలను ఈసీ సీరియస్ గా తీసుకుంది. కొంత మంది పోలీసు అధికారులను ఇప్పటికే బదిలీ చేసింది. అంతే కాకుండా ఈ ఘటనలకు సంబంధించి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పటు చేయగా.. ఆ బృందం ఇప్పటికే దర్యాప్తు చేపట్టింది. ఈ నివేదికను ఎన్నికల సంఘానికి అందించనుంది. అయితే నివేదిక పరిశీలన అనంతరం చర్యలు తీసుకోనున్నారు ఉన్నతాధికారులు.