NTV Telugu Site icon

Somnath Bharti : మూడోసారి మోడీ ప్రధాని అయితే గుండు కొట్టుకుంటా : ఆప్ ఎంపీ అభ్యర్థి సోమనాథ్

New Project (12)

New Project (12)

ఈ రోజు విడుదలైన దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్‌లో ఎన్డీయే మరోసారి ఆధిక్యత కనబరుస్తోంది. ఢిల్లీని బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తుందని పలు ఎగ్జిట్ పోల్స్ అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆప్ ఎంపీ అభ్యర్థి కీలక వ్యాఖ్యలు చేశారు. నరేంద్ర మోడీ మూడోసారి ప్రధాని అయితే గుండు కొట్టించుకుంటానని ఆమ్ ఆద్మీ పార్టీ న్యూఢిల్లీ లోక్‌సభ స్థానం అభ్యర్థి సోమనాథ్ భారతి ప్రకటించారు. జూన్ 4న ఎగ్జిట్ పోల్స్ అన్నీ తప్పని నిరూపిస్తామని పేర్కొన్నారు. ఎగ్జిట్ పోల్స్ పై సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు. ఢిల్లీలోని మొత్తం ఏడు స్థానాల్లో భారత కూటమి విజయం సాధిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. “మోడీ భయం వల్ల ఆయన ఓడిపోతారని ఎగ్జిట్ పోల్‌లు అనుమతించడం లేదు. కాబట్టి జూన్ 4న ఫలితాల కోసం మనమందరం వేచిచూడాలి. ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా అత్యధికంగా ఓటు వేశారు” అని రాసుకొచ్చారు.

Read more : Blood Tests Yearly : ఏడాది కోసారి ఈ వైద్య పరీక్షలు చేయించుకోండి

సోమనాథ్ భారతి న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. మాజీ విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ కుమార్తె అయిన భాజపా అభ్యర్థి బన్సూరి స్వరాజ్‌ ప్రధాన పోటీ దారుగా ఉన్నారు. బీజేపీ తొలిసారిగా ఆయనను ఎన్నికల రాజకీయాల్లోకి దింపింది. ఈసారి ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ నాలుగు స్థానాల్లో పోటీ చేయగా.. కాంగ్రెస్ మూడు స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టిన సంగతి తెలిసిందే. AAP పోటీ చేసిన స్థానాలు తూర్పు ఢిల్లీ, న్యూఢిల్లీ, పశ్చిమ ఢిల్లీ, దక్షిణ ఢిల్లీ. చాందినీ చౌక్, నార్త్ వెస్ట్ ఢిల్లీ, ఈశాన్య ఢిల్లీలో కాంగ్రెస్ పోటీ చేస్తోంది.

Show comments