Blood Tests Yearly : ఏడాది కోసారి ఈ వైద్య పరీక్షలు చేయించుకోండి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రస్తుత తరుణంలో ఎప్పుడు ఏ జరుగుతుందో ఎవ్వరూ చెప్పలేరు. మన ఆరోగ్యం కూడా ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం. మనం రోజువారీగా తీసుకునే ఆహారం, జీవన శైలితో మన ఆరోగ్యం ముడిపడి ఉంటుంది. ప్రతిఒక్కరూ అనారోగ్య సమస్య వచ్చిన తర్వాత కంగారుపడుతుంటారు. ఈ సమస్యలు రాకముందే స్క్రీనింగ్ పరీక్షలు చేయించుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఏడాది సంవత్సరం ఇప్పుడు చెప్పబోయే ఐదు రకాల రక్త పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలంటున్నారు. అవేంటో చూద్దాం. శరీరంలో బాడీలో రక్తంలో ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్ల సంఖ్యను తెలుసుకోవడానికి CBC పరీక్షను సిఫార్సు చేస్తుంటారు. అలాగే ఈ టెస్ట్ మీ మొత్తం ఆరోగ్యం, రక్తహీనత, అంటువ్యాధులు, రక్తం గడ్డకట్టడానికి సంబంధించిన రుగ్మతల నిర్ధారణ గురించి అవసరమైన సమాచారాన్ని తెలియజేస్తుంది. అంతేకాదు.. ఈ పరీక్ష ప్రత్యేకంగా శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయి ఎంతమొత్తంలో ఉందనే సమాచారాన్ని అందిస్తుంది.
Read more : Road Accident : జర్నీ సినిమా సీన్ రిపీట్.. రెండు బస్సులు ఢీ.. ముగ్గురు మృతి, 30 మందికి గాయాలు..
Also Read
- Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
- Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
- Uttam Kumar Reddy : నీటి హక్కులపై వెనక్కి తగ్గేది లేదు.. బీఆర్ఎస్పై ఉత్తమ్ ఫైర్
- AP Police: ఏపీ పోలీసుల సంచలన ఆపరేషన్.. మారేడుమిల్లి అడవుల్లో మావోయిస్టు డంప్ స్వాధీనం..
ఈ పరీక్షను ప్రతి సంవత్సరం తప్పక చేయించుకోవాలి. ఇదే థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. మన బాడీలో థైరాయిడ్ గ్రంథి జీవక్రియ, శక్తి ఉత్పత్తి, వివిధ శారీరక విధుల నియంత్రణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అదే ఈ గ్రంథి పనితీరులో ఏదైనా మార్పులు వస్తే అలసట, బరువులో మార్పులు, మానసిక సమస్యలు, హృదయ స్పందన రేటులో మార్పులు వంటి లక్షణాలకు దారితీస్తుందంటున్నారు నిపుణులు. కాంప్రహెన్సివ్ మెటబాలిక్ ప్యానెల్ టెస్ట్ అనేది.. మన బాడీలో వివిధ జీవక్రియల, అవయవాల పనితీరును అంచనా వేసే ఒక సమగ్ర రక్త పరీక్ష. ఈ టెస్ట్.. రక్తంలో గ్లూకోజ్, ఎలక్ట్రోలైట్స్ (సోడియం, పొటాషియం, క్లోరైడ్, బైకార్బోనేట్), మూత్రపిండాల పనితీరు (క్రియాటినిన్, బ్లడ్ యూరియా నైట్రోజన్), కాలేయ పనితీరు (బిలిరుబిన్, అల్బుమిన్, కాలేయ ఎంజైమ్లు), ప్రోటీన్ స్థాయిలు సరైన మోతాదులో ఉన్నాయో లేదో తెలుపుతుంది.
తదుపరిది లిపిడ్ ప్రొఫైల్. ఇది మీ కొలెస్ట్రాల్ స్థాయిలు, గుండె ఆరోగ్యానికి సంబంధించిన ఇతర లిపిడ్ మార్కర్లను అంచనా వేయడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉన్నాయా? తక్కువగా ఉన్నాయా? అనే విషయంలో క్లారిటీ వస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అంచనా వేయడానికి, మధుమేహం లేదా ప్రీడయాబెటిస్ను గుర్తించడంలో ఈ పరీక్ష సహాయపడుతుంది. సాధారణంగా రెండు గ్లూకోజ్ టెస్ట్లు ఉంటాయి. అందులో ఒకటి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్. ఇందుకోసం ఖాళీ కడుపుతో బ్లడ్ తీసుకుంటారు. హిమోగ్లోబిన్ A1C ఇది మరో గ్లుకోజ్ పరీక్ష. దీని ద్వారా రెండు నుంచి మూడు నెలల్లో మీ సగటు రక్తంలో చక్కెర స్థాయిలను తెలుసుకోవచ్చు. ఒకవేళ మీలో మధుమేహం లేదా ప్రీ డయాబెటిస్ ఉంటే ఇట్టే తెలిసిపోతుంది.
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో నేడు విశేష ఘట్టం.. శ్వేతార్క గణపతి కల్యాణం
-
Dhoni Jersey: ధోనికి సీఎస్కే అరుదైన గౌరవం.. ఐకానిక్ నంబర్ 7 జెర్సీ రిటైర్..
-
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
-
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Food Safety Raids: హైదరాబాద్ హోటళ్లపై ఫుడ్ సేఫ్టీ కొరడా.. 4 రెస్టారెంట్ల లైసెన్సులు సస్పెండ్, 2 సీజ్..
-
Ind Vs NZ: వెల్లింగ్టన్ టెస్టుకు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ.. ఫీజులో 35 శాతం కోత..
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్స్క్రీన్తో భారత్లోకి రానున్న VinFast VF5 ఫేస్లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..