Site icon NTV Telugu

Chandrababu : అమరావతి రాజధానిగా ఉండింటే.. తెనాలి అభివృద్ధి ఇంకా బాగుండేది

Cbn

Cbn

ఈ ఐదేళ్ళ లో బాగుపడిన వర్గాలు ఎవరు లేరని.. ఈ రోజు నేను పెట్టిన మేనిఫెస్టో తో అన్ని వర్గాలు బాగుపడతాయని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. తెనాలిలో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ.. “ప్రభుత్వం అంటే ప్రజలకు ఆమోదయోగ్యం అయిన ప్రభుత్వం ఉండాలి.. సంక్షేమం ,అభివృద్ధి కలగలసి ఉండాలి. అమరావతి రాజధానిగా అభివృద్ధి చెందితే, తెనాలి అభివృద్ధి ఇంకా బాగుండేది. గతం లో రాజకీయాలు హుందా గా ఉండేవి. ఇప్పుడు ఉన్న సీఎం అహంకారం కలిగిన వ్యక్తి. ప్రభుత్వ డబ్బుతో ప్రజా వేదిక కడితే, ఆ వేదిక కూల్చి విధ్వంసం కర పాలనకు తెరదీశాడు. ఊరూరు తిరిగి ముద్దులు పెట్టిన జగన్ దెబ్బకు ప్రజలు కరిగి పోయారు. కృష్ణ డెల్టాకు నీరిద్దామని, పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తే ఆ ప్రాజెక్టుల ను మూల పెట్టారు. పవన్ కళ్యాణ్ ను చులకనగా మాట్లాడుతున్నారు. అలాంటి వ్యక్తులను, శాశ్వతంగా మూల కూర్చోబెట్టాలి.

READ MORE: Monditoka Jaganmohan Rao: ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న మొండితోక జగన్మోహన్ రావు

పవన్ కళ్యాణ్, నేను కష్టపడేది, ప్రజల కోసమే ప్రజలకు గెలవాలని కష్టపడుతున్నామని చంద్రబాబు అన్నారు. తెనాలి సభలో ఆయన మాట్లాడుతూ.. “ఆంధ్ర పారిస్ ప్రజలు చాలా తెలివిగల వాళ్ళు. తెలివిగా నిర్ణయం తీసుకొని, ఓటు వేయండి. రేపటినుండి, ప్రచారానికి వచ్చిన, టీడీపీ, జనసేన నాయకులకు, మీ సెల్ ఫోన్ టార్చ్ లైట్, వెలుగులతో స్వాగతం పలకండి. మా భవిష్యత్తుకు ఓటు వేయమని మీ తల్లిదండ్రులకు చెప్పండి. వైసీపీ విముక్త రాష్ట్రం కోసమే, పవన్ కళ్యాణ్ త్యాగం చేశారు. టీడీపీ, జనసేన, అభ్యర్థులను పెద్ద మెజారిటీతో గెలిపించాలి. టీడీపీ హయంలో సంక్షేమం, అభివృద్ధిలో రాష్ట్రం నెంబర్ వన్ గా ఉంది. ఐదు రూపాయలకి ఎన్టీఆర్ క్యాంటీన్ ద్వారా అన్నం పెడుతుంటే సహించలేదు. రంజాన్ తోఫాలు ఇచ్చేవాళ్ళం. ముస్లిం యువతుల పెళ్లిలకు, దుల్హన్ పథకం ద్వారా డబ్బులు ఇచ్చేవాళ్లం. మసీదులకు ఆర్థిక సాయం చేశాం. పార్లమెంట్లో బిల్లులకు జగన్ రహస్తి ఒప్పందాలు చేసుకున్నారు. నాకు రహస్య ఒప్పందాలు ఉండవు. ఆ మేనిఫెస్టోలో మైనారిటీ డిక్లరేషన్ కూడా చేశా. మళ్ళీ వైసీపీ, అధికారంలోకి వస్తే ఈ వ్యాపారాల్లో వాటాలు అడుగుతారు. జగన్ లాండ్ గ్రాబింగ్ యాక్ట్ ..తో ప్రజలు తీవ్రంగా నష్టపోతారు. జగన్ మేనిఫెస్టో వెలవెలబోతుంది , టిడిపి మేనిఫెస్టో కళకళలాడుతుంది. నాకు సంపద సృష్టిస్తానన్న నమ్మకం ఉంది. అందుకే మేనిఫెస్టోలో సంక్షేమ కార్యక్రమాల పంట పండించా.” ‘

Exit mobile version