Site icon NTV Telugu

Allu Arjun : 2026లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టిన ఐకాన్ స్టార్.. ఫ్యాన్స్‌ కోసం ఎమోషనల్ నోట్!

Alluarjun

Alluarjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన సోషల్ మీడియా వేదికగా 2026వ సంవత్సరానికి గ్రాండ్‌గా స్వాగతం పలుకుతూ, తన అభిమానుల కోసం ఒక ప్రత్యేకమైన సందేశాన్ని పంచుకున్నారు. గడిచిన ఏడాది తనకు ఎన్నో మధుర జ్ఞాపకాలను మిగిల్చిందని, ఈ ప్రయాణంలో తను నేర్చుకున్న పాఠాలు మరియు తనపై ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ఎప్పటికీ రుణపడి ఉంటానని ఆయన ఎంతో వినమ్రంగా పేర్కొన్నారు. తన కెరీర్‌లో ఎదురైన ప్రతి ఒడిదుడుకుల్లోనూ, ప్రతి కీలక దశలోనూ వెన్నంటి నిలిచిన అభిమానులందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Also Read : Anasuya : వెనక్కి తగ్గని అనసూయ.. హాట్ బికిని ఫోటోలతో సోషల్ మీడియా షేక్!

ఈ సందేశంలో ఆయన మరింత స్పందిస్తూ.. ‘నా అభిమానుల నమ్మకమే నాలో ప్రతిరోజూ కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. మీరు ఇచ్చే ధైర్యమే నన్ను మరింత కష్టపడేలా చేస్తూ, నా జీవితానికి ఒక గొప్ప అర్థాన్ని ఇస్తోంది’ అని రాసుకొచ్చారు. భవిష్యత్తు గురించి ఎంతో ఉత్సాహంగా ఉన్నానని, రాబోయే కొత్త ప్రాజెక్టులు మరియు సవాళ్లను స్వీకరించడానికి తాను పూర్తి సిద్ధంగా ఉన్నానని ఆయన స్పష్టం చేశారు. 2026 సంవత్సరం సరికొత్త ఆరంభాలకు వేదిక కావాలని ఆకాంక్షిస్తూ, తన ఐకానిక్ స్టైల్‌లో ‘హ్యాపీ న్యూ ఇయర్ 2026’ అంటూ ఈ ఎమోషనల్ నోట్‌ను ముగించారు.

Exit mobile version