NTV Telugu Site icon

Piriya Vijaya: సీఎం జగన్‌కు రుణపడి ఉంటా.. సర్వే రిపోర్ట్‌ ఆధారంగానే నాకు ఇంఛార్జ్‌ బాధ్యతలు

Piriya Vijaya

Piriya Vijaya

Piriya Vijaya: సీఎం వైఎస్‌ జగన్‌ను రుణపడి ఉంటాను అన్నారు ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌ పిరియా విజయ.. శ్రీకాకుళంలో ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆమె.. ఇచ్చాపురం సమన్వయ కర్తగా నియమించినందుకు జగన్ కు రుణపడి ఉంటాం… ఒక బీసీ మహిళగా, సర్వే రిపోర్ట్ ఆధారంగా నాకు ఇంచార్జ్ భాద్యతలు అప్పగించారని తెలిపారు. ఇక, టీడీపీ హాయంలో ఇచ్చిన అభివృద్ది, సంక్షేమం ఏమీలేదు.. రెండున్నరేళ్లు కరోనాతో ఇబ్బంది పడినా అభివృద్ది – సంక్షేమం అందించాం అన్నారు. ప్రతి గ్రామంలో ఊర్లలో జగనన్న అందించిన సంక్షేమం కనిపిస్తుంది. టీడీపీ హాయాంలో డయాలసిస్ చేయించుకునేందకు ఎలాంటి సౌకర్యాలు లేవు .. గతంలో ఉద్దానంలో కిడ్నీ రోగులు చనిపోయారనే వార్తలు వినిపించేవి. ఉద్దానంను పూర్తిస్థాయిలో ఆదుకున్న వ్యక్తి సీఎం వైఎస్‌ జగన్‌ మాత్రమే అన్నారు.

Read Also: Governor Tamilisai: రాజ్‌భ‌వ‌న్‌లో భోగి వేడుక‌లు.. పాయసం వండిన గవర్నర్‌

నేడు సీఎం వైఎస్‌ జగన్‌ కిడ్నీ రోగుల పెన్షన్లు పెంచారు. రీసెర్చ్ ఆస్పత్రి కట్టించారు. 805 గ్రామాలకు త్రాగునీటికి కోసం 700 కోట్ల రూపాయలతో ఉద్దానం డ్రింకింగ్ వాటర్ స్కిం తీసుకువచ్చారనరి ప్రశంసలు కురిపించారు పిరియా విజయ.. ఇక, ఇచ్చాపురంలో వైసీపీలో ఏ గ్రూపులు లేవు అని స్పష్టం చేశారు. రెడ్డీలకు జెడ్పీ చైర్మెన్, యాదవులకు ఎమ్మెల్సీ ఇచ్చి సీఎం జగన్ సామాజిక సమన్యాయం చేశారని తెలిపారు. వైఎస్‌ జగన్ ఇచ్చిన జిల్లా పరిషత్ చైర్మెన్ పదవిని సమర్థవంతంగా నిర్వహించాను. నేడు నన్ను తప్పించి వారికి ఆ స్థానం ఇవ్వడాన్ని ఆహ్వానిస్తున్నానని తెలిపారు ఇచ్చాపురం నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌ పిరియా విజయ.