IND vs AUS World Cup Final: రేపు అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్ మ్యాచ్ జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్‌లో భారత్- ఆస్ట్రేలియా జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ వీక్షించడానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ సహా పలువురు ప్రముఖులు నరేంద్ర మోడీ స్టేడియంకు రానున్నారు. అంతేకాదు సినిమా సెలెబ్రిటీలు కూడా భారీ సంఖ్యలో ఈ మ్యాచ్ కు హాజరు కాబోతున్నారు. ఈ నేపథ్యంలో- నరేంద్ర మోడీ స్టేడియం దగ్గర గుజరాత్ సర్కార్ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తోంది.
Read Also: Bandi Sanjay: నేడు భైంసాలో బీజేపీ బహిరంగ సభ.. పాల్గొననున్న బండి సంజయ్
అయితే, ఈ మ్యాచ్‌ను చూడటానికి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో పాటు ఆస్ట్రేలియా ఉప ప్రధాని రిచర్డ్ మార్లెస్ కూడా హాజరు కాబోతున్నారు. మ్యాచ్‌ను వీక్షించడానికి దేశ విదేశాల నుంచి ప్రముఖులు వస్తుండటంతో గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించారు. మ్యాచ్ నిర్వహణకు కావాల్సిన భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. భారత వైమానిక దళానికి చెందిన సూర్య కిరణ్ ఏరోబాటిక్ బృందం మ్యాచ్‌కు ముందు పది నిమిషాల పాటు ఎయిర్ షోను నిర్వహిస్తుంది. మిడ్-ఇన్నింగ్స్‌లో కంపోజర్ ప్రీతమ్ ప్రదర్శనతో సహా అనేక ఈవెంట్‌లు ఈ ఫైనల్ మ్యాచ్ లో నిర్వహించనున్నారు. ఈ విన్యాసాలు క్రికెట్ అభిమానులను అలరించనున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.