Site icon NTV Telugu

Virat Kohli Record: అనిల్ కుంబ్లే రికార్డ్ బ్రేక్.. తొలి క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ!

Virat Kohli Catch Record

Virat Kohli Catch Record

Virat Kohli becomes superman at first slip to dismiss Mitchell Marsh in IND vs AUS Match: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో అత్యధిక క్యాచ్‌లు (వికెట్‌ కీపర్‌ కాకుండా) పట్టిన భారత ఆటగాడిగా నిలిచాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్‌లో కోహ్లీ ఈ రికార్డు అందుకున్నాడు. ఆస్ట్రేలియాపై ఓపెనర్ మిచిల్‌ మార్ష్‌ క్యాచ్‌ను అందుకోవడంతో విరాట్‌ ఖాతాలో ఈ అరుదైన రికార్డు చేరింది. ఇప్పటివరకు ప్రపంచకప్‌ టోర్నీలో కోహ్లీ 15 క్యాచ్‌లు అందుకున్నాడు.

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌కు ముందు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లేతో కలిసి విరాట్ కోహ్లీ సమానంగా ఉన్నాడు. కుంబ్లే 14 క్యాచ్‌లతో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉండగా.. తాజాగా విరాట్ టాప్‌లోకి దూసుకొచ్చాడు. 15 క్యాచ్‌లతో కుంబ్లే ఆల్‌టైమ్‌ రికార్డును విరాట్ బ్రేక్‌ చేశాడు. ఈ క్యాచ్ 28వ ప్రపంచకప్ మ్యాచ్‌లో కోహ్లీ అందుకున్నాడు. కుంబ్లే తర్వాత ఈ జాబితాలో దిగ్గజ క్రికెటర్లు కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్ ఉన్నారు. మెగా టోర్నీలలో ఈ ఇద్దరూ 12 క్యాచ్‌లు పట్టారు.

Also Read: World Cup 2023: సచిన్‌ రికార్డు బద్దలు.. ప్రపంచకప్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా డేవిడ్‌ వార్నర్‌!

మిచిల్‌ మార్ష్‌ ఔట్ చేసే క్రమంలో విరాట్ కోహ్లీ అద్బుతమైన క్యాచ్‌ను అందుకున్నాడు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 3 ఓవర్‌ వేసిన స్టార్ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా బౌలింగ్‌లో మార్ష్‌ డిఫెన్స్‌ ఆడటానికి ప్రయత్నించాడు. అయితే బంతి ఔట్‌ సైడ్‌ ఎడ్జ్‌ తీసుకుని స్లిప్స్‌ దిశగా దూసుకెళ్లింది. ఫస్ట్ స్లిప్‌లో విరాట్ డైవ్‌ చేస్తూ అద్బుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో మార్ష్‌ ఖాతా తెరవకుండానే పెవిలియన్‌కు చేరాడు. కోహ్లీ క్యాచ్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

Exit mobile version