World Cup 2023: సచిన్ రికార్డు బద్దలు.. ప్రపంచకప్ చరిత్రలో తొలి బ్యాటర్‌గా డేవిడ్ వార్నర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
David Warner Breaks Sachin Tendulkar’s ODI World Cup Record: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్ టోర్నీలో అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ ఈ రికార్డు సాదించాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఏడవ ఓవర్ రెండో బంతికి ఫోర్ బాదిన దేవ్ భాయ్.. ప్రపంచకప్ టోర్నీలో 1,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.
వన్డే ప్రపంచకప్ టోర్నీలో 19 ఇన్నింగ్స్‌లో డేవిడ్ వార్నర్ 1,000 పరుగులు పూర్తి చేశాడు. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్, దక్షిణాఫ్రికా లెజెండ్ ఏబీ డివిలియర్స్ పేరిట సంయుక్తంగా ఉన్న రికార్డును వార్నర్ బద్దలు కొట్టాడు. సచిన్, డివిలియర్స్ 20 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అందుకున్నారు. విండీస్ దిగ్గజం వివియన్ రిచర్డ్స్, టీమిండియా కెప్టెన్ సౌరవ్ గంగూలీ 21 ఇన్నింగ్స్‌లలో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మార్క్ వా, దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్ హర్షల్ గిబ్స్ 22 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించారు.
Also Read
- Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
- Yamaha R15 లవర్స్‌కు బ్యాడ్ న్యూస్.. నిలిపివేయాలని కంపెనీ ప్లాన్..
- Jana Sena - TDP: ఏలూరు మేయర్ సీటుపై జనసేన పట్టు..! అప్పలనాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు
- రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
Also Read: World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 14000లకు పెంచిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు
హాఫ్ సెంచరీ చేసేలా కనిపించిన డేవిడ్ వార్నర్ (41) అనూహ్యంగా పెవిలియన్ చేరాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలానికి వార్నర్ తలొంచక తప్పలేదు. 17వ ఓవర్ మూడో బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 76 రన్స్ చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్ (34), మార్నస్ లబుషేన్ (2) ఉన్నారు.
Kuldeep Yadav Gets David Warner…
One More Wicket For #Bharat #INDvsAUS #WorldCup2023pic.twitter.com/egXCQB0qpP
— Lost Man (@iamaliveX) October 8, 2023
తాజావార్తలు
-
Flydubai Flight: ఫ్లై దుబాయ్ విమానం హైజాక్ కలకలం.. ఇజ్రాయెల్ రంగంలోకి దిగడంతో..!
-
Dancers Association Issue: ఫిలిం ఛాంబర్ ను ముట్టడించిన తెలంగాణ వాదులు?
-
Sumalatha: ఫిలిం ఫెడరేషన్ అధ్యకుడు అనిల్ ను సస్పెండ్ చేయాలి
-
IND vs SL Semi Final: భారత్, శ్రీలంక సెమీఫైనల్‌కు వర్షం ముప్పు?.. మ్యాచ్ రద్దైతే ఫైనల్ బెర్త్ ఎవరిది?
-
Probation Period Rules: జాబ్‌లో ‘ప్రొబేషన్ పీరియడ్’ అంటే ఏంటో తెలుసా? ఆ టైంలో కంపెనీ మిమ్మల్ని తీసేయవచ్చా! రూల్స్ ఇవే!
ట్రెండింగ్
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!