NTV Telugu Site icon

World Cup 2023: సచిన్‌ రికార్డు బద్దలు.. ప్రపంచకప్‌ చరిత్రలో తొలి బ్యాటర్‌గా డేవిడ్‌ వార్నర్‌!

David Warner Bat Lift

David Warner Bat Lift

David Warner Breaks Sachin Tendulkar’s ODI World Cup Record: ఆస్ట్రేలియా సీనియర్ ఓపెనర్‌ డేవిడ్‌ వార్నర్‌ సరికొత్త చరిత్ర సృష్టించాడు. వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో అత్యంత వేగంగా 1,000 పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. వన్డే ప్రపంచకప్‌ 2023లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో వార్నర్ ఈ రికార్డు సాదించాడు. హార్దిక్ పాండ్యా వేసిన ఏడవ ఓవర్ రెండో బంతికి ఫోర్ బాదిన దేవ్ భాయ్.. ప్రపంచకప్‌ టోర్నీలో 1,000 పరుగులు పూర్తి చేసుకున్నాడు.

వన్డే ప్రపంచకప్‌ టోర్నీలో 19 ఇన్నింగ్స్‌లో డేవిడ్‌ వార్నర్‌ 1,000 పరుగులు పూర్తి చేశాడు. దాంతో క్రికెట్ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌, దక్షిణాఫ్రికా లెజెండ్‌ ఏబీ డివిలియర్స్‌ పేరిట సంయుక్తంగా ఉన్న రి​కార్డును వార్నర్‌ బద్దలు కొట్టాడు. సచిన్‌, డివిలియర్స్‌ 20 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అందుకున్నారు. విండీస్‌ దిగ్గజం వివియన్‌ రిచర్డ్స్‌, టీమిండియా కెప్టెన్ సౌరవ్‌ గంగూలీ 21 ఇన్నింగ్స్‌లలో.. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్‌ మార్క్‌ వా, దక్షిణాఫ్రికా మాజీ బ్యాటర్‌ హర్షల్‌ గిబ్స్‌ 22 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించారు.

Also Read: World Cup 2023: క్రికెట్ ఫ్యాన్స్‎కు గుడ్ న్యూస్.. 14000లకు పెంచిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్ టికెట్లు

హాఫ్ సెంచరీ చేసేలా కనిపించిన డేవిడ్‌ వార్నర్‌ (41) అనూహ్యంగా పెవిలియన్ చేరాడు. మణికట్టు స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ స్పిన్ మాయాజాలానికి వార్నర్ తలొంచక తప్పలేదు. 17వ ఓవర్ మూడో బంతికి రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. 18 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్ రెండు వికెట్ల నష్టానికి 76 రన్స్ చేసింది. క్రీజులో స్టీవ్ స్మిత్ (34), మార్నస్ లబుషేన్ (2) ఉన్నారు.