Site icon NTV Telugu

IND vs AUS: భారత్ స్పిన్ మాయాజాలం.. ఆస్ట్రేలియా ఆలౌట్‌! టీమిండియా టార్గెట్ ఎంతంటే?

Rohit, Kohli, Bumrah

Rohit, Kohli, Bumrah

Australia 199 all out after Ravindra Jadeja, Kuldeep Yadav heroics: చెన్నైలోని చెపాక్‌ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ 2023 ఆరంభ మ్యాచ్‌లో భారత బౌలర్లు చెలరేగారు. ముఖ్యంగా స్పిన్నర్లు విజృంభించడంతో.. ఆస్ట్రేలియా మోస్తరు స్కోరుకే పరిమితమైంది. 49.3 ఓవర్లకు 199 పరుగులు చేసి ఆస్ట్రేలియా ఆలౌట్‌ అయింది. దాంతో భారత్ టార్గెట్ 200గా ఉంది. ఆసీస్ బ్యాటర్లలో డేవిడ్ వార్నర్ (41), స్టీవ్ స్మిత్ (46) టాప్ స్కోరర్లు. భారత స్పిన్నర్లలో రవీంద్ర జడేజా 3 వికెట్స్ తీయగా.. కుల్దీప్ యాదవ్ 2, ఆర్ అశ్విన్ ఒక వికెట్ పడగొట్టాడు. పేసర్ జస్ప్రీత్ బుమ్రా 2 వికెట్స్ తీశాడు.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్ మిచెల్ మార్ష్ డకౌట్ అయ్యాడు. ఈ సమయంలో డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టును ఆదుకున్నారు. హాఫ్ సెంచరీఐ చేరువకు వచ్చిన వార్నర్‌ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేశాడు. దాంతో ఆసీస్ పతనం మొదలైంది. కుల్దీప్ సహా జడేజా మాయాజాలానికి స్మిత్, మార్నస్ లబుషేన్ (27), అలెక్స్‌ కారీ (0), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (15) వెంటవెంటనే ఔట్ అయ్యారు. కామరూన్ గ్రీన్ (8) కూడా క్రీజులో నిలవలేకపోయాడు.

Also Read: IND vs AUS: జార్వో బాబాయ్ మళ్లీ వచ్చేశాడు.. భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్‌కు అంతరాయం! రంగంలోకి కోహ్లీ

ఆస్ట్రేలియా 140 పరుగులకే 7 వికెట్స్ కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ సమయంలో కెప్టెన్ పాట్ కమిన్స్‌ (15), పేసర్ మిచెల్ స్టార్క్ (28) పోరాడటంతో ఆసీస్‌ ఆ మాత్రమైనా పరుగులు చేయగలిగింది. ఆడమ్ జంపా, జోష్ హేజిలీవుడ్ నిరాశపరిచారు. జడేజా (3/28), కుల్దీప్ (2/42), అశ్విన్‌ (1/34), బుమ్రా (2/35) ఆసీస్‌ను కట్టడి చేశారు. అయితే హార్దిక్ పాండ్యా 3 ఓవర్లలో 28 రన్స్ ఇచ్చి కాస్త నిరాశపరిచాడు. మరికాసేపట్లో భారత్ ఇన్నింగ్స్ మొదలవుతుంది.

Exit mobile version