Site icon NTV Telugu

ICC Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‭లో అదరగొట్టిన తెలుగు తేజం తిలక్ వర్మ..

Tilak Varma

Tilak Varma

ICC Rankings: ఐసీసీ తాజాగా విడుదల చేసిన టీ20 ర్యాంకింగ్స్‌లో సంచలనం నమోదయ్యింది. టీమిండియా యంగ్ ఆటగాడు తిలక్ వర్మ తన కెరియర్ అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆధారంగా తిలక్ వర్మ ఈ స్థానానికి చేరుకున్నాడు. ప్రస్తుతం తిలక్ వర్మ ఏకంగా 720 స్థానలు ఎగబాకి టి20 లలో రెండో స్థానంను దక్కించుకున్నాడు. అతని కెరీర్‌లో ఇదే అత్యుత్తమ ర్యాంకింగ్. ఇప్పుడు టీ20 ర్యాంకింగ్స్‌లో అతి పిన్న వయస్కుడైన టాప్ ప్లేయర్‌గా అవతరించే అవకాశం తిలక్ వర్మకు దక్కింది. ఈ రికార్డు ప్రస్తుతం 6 సంవత్సరాల క్రితం బాబర్ అజామ్ పేరిట ఉంది. బాబర్ అజామ్ 23 ఏళ్ల 105 రోజుల్లో ఈ రికార్డు సృష్టించాడు. ఇంగ్లండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లో తిలక్ వర్మ అద్భుతంగా బ్యాటింగ్ చేయడం ద్వారా ఈ రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉంది.

Also Read: Budget 2025 : పన్నులు కాకుండా ప్రభుత్వ ఆదాయ వనరులు ఏమిటి?.. ఎక్కడి నుంచి మనీ వస్తుందో తెలుసా ?

తిలక్ వర్మ నెంబర్ 1 స్థానానికి రావాలంటే తిలక్ వర్మ ట్రావిస్ హెడ్‌ని దాటాల్సి ఉంటుంది. ప్రస్తుతం వీరిద్దరి మధ్య 23 రేటింగ్ పాయింట్ల తేడా ఉంది. తిలక్ వర్మ తదుపరి రెండు మ్యాచ్‌లలో తన బ్యాట్‌తో పరుగులు చేయడం ద్వారా ట్రావిస్ హెడ్‌ను దాటే అవకాశం లేకపోలేదు. ఇక మరోవైపు ఇంగ్లండ్‌తో జరిగే సిరీస్‌లో యశస్వి జైస్వాల్ ఆడడం లేదు. దాంతో ర్యాంకింగ్‌లో అతను ఒక స్థానం దిగజారి తొమ్మిదో స్థానానికి చేరుకున్నాడు. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నాలుగో స్థానంలో ఉన్నాడు. వరుసగా మూడుసార్లు ఫ్లాప్ అయిన సూర్య.. తర్వాతి రెండు మ్యాచులలో పేలవ ప్రదర్శన కనబరిస్తే ర్యాంకింగ్ మరింత పడిపోతుంది. మరోవైపు బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో వరుణ్ చక్రవర్తి సంచలనం సృష్టించాడు. గత మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి 25 స్థానాలు ఎగబాకి ఐదో స్థానానికి చేరుకున్నాడు. అర్ష్‌దీప్ సింగ్ ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. రవి బిష్ణోయ్ పదో స్థానంలో, అక్షర్ పటేల్ పదకొండో స్థానంలో కొనసాగుతున్నారు.

Exit mobile version