శ్రీలంక క్రికెట్ బోర్డుకు ఐసీసీ బిగ్ షాక్ ఇచ్చింది. అండర్ 19 వరల్డ్ కప్ శ్రీలంకలో నిర్వహించాలని ముందుగా అనుకున్నప్పటికీ.. ఇప్పుడు వేదికను మర్చారు. ఈరోజు అహ్మదాబాద్‌లో సమావేశమైన ఐసీసీ బోర్డు.. 2024 అండర్ -19 ప్రపంచ కప్ నిర్వహణ, ఏర్పాట్లపై చర్చించింది. ఈ సందర్భంగా శ్రీలంక క్రికెట్ బోర్డులో కొనసాగుతున్న గందరగోళాన్ని దృష్టిలో ఉంచుకుని ఆతిథ్య బాధ్యతలను దక్షిణాఫ్రికాకు మార్చారు.
Read Also: NCERT: చరిత్ర పుస్తకాల్లో రామాయణ, మహాభారత పాఠ్యాంశాలు.. NCERT కీలక సిఫార్సులు..
శ్రీలంక క్రికెట్ బోర్డులో అంతర్గత కుమ్ములాటలు జరుగుతున్న క్రమంలో ఐసీసీ పాలక మండలి ఈ నిర్ణయం తీసుకొంది. ఇదిలా ఉంటే.. 2023 ప్రపంచ కప్‌లో పేలవమైన ప్రదర్శన కారణంగా శ్రీలంక క్రీడా మంత్రి మొత్తం బోర్డును తొలగించారు. ఇది బోర్డులో ప్రభుత్వ జోక్యంగా భావించిన ఐసిసి శ్రీలంక బోర్డును సస్పెండ్ చేసింది. అయితే శ్రీలంక క్రికెట్ బోర్డుపై విధించిన సస్పెన్షన్ ను ఎత్తివేయొద్దని ఐసీసీ బోర్డు సభ్యులందరూ ఏకగ్రీవ తీర్మానం చేశారు. ఇక లంకలో క్రికెట్ సాధారణంగానే ఉంటుంది అని లంక బోర్డు మాజీ అధ్యక్షుడు షమ్మీ సిల్వా ఓ ప్రకటనలో తెలిపాడు. అండర్-19 ప్రపంచ కప్ 2024 జనవరి 14 నుంచి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించనున్నారు.
Read Also: Byju’s: రూ.9 వేల కోట్లు చెల్లించండి.. బైజూస్‌కు ఈడీ నోటీసులు
ఇదిలా ఉంటే.. 2023 ప్రపంచకప్‌లో శ్రీలంక చాలా పేలవమైన ప్రదర్శన కనబరిచింది. దీంతో పాయింట్ల పట్టికలో శ్రీలంక జట్టు 9వ స్థానంలో నిలిచింది. ఆడిన 9 మ్యాచ్‌ల్లో కేవలం రెండు మాత్రమే గెలిచింది. దీంతో ఈ టోర్నీలో శ్రీలంక చెత్త ప్రదర్శన చూపించింది. అంతకుముందు ఆసియా కప్ ఫైనల్ లో కూడా తీవ్రంగా నిరాశపరిచిన సంగతి తెలిసిందే.