Site icon NTV Telugu

King Kohli: వన్డే ప్రపంచకప్‌కు విరాట్ కోహ్లీ సిద్ధం.. బ్రహ్మానందం మాదిరి స్టిల్స్ వైరల్!

Virat Kohli Jersey

Virat Kohli Jersey

Virat Kohli’s Indian Jersey Pics Goes Viral: టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సొంత గడ్డపై జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌ 2023కి సిద్దమవుతున్నాడు. వన్డే ప్రపంచకప్‌లో భాగంగా ఆదివారం (అక్టోబర్‌ 6) భారత్ తన తొలి మ్యాచ్‌ ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ‘కింగ్ కోహ్లీ’ చైన్నైలోని చిదంబరం స్టేడియంలో శ్రమిస్తున్నాడు. ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం 3-4 రోజుల క్రితమే చెన్నై చేరుకున్న.. విరాట్ ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. భారత జట్టుకు టైటిల్ అందించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాడు.

ప్రపంచకప్‌ 2023లో బరిలోకి దిగే కొత్త జెర్సీతో విరాట్ కోహ్లీ ఉన్న పోటోలను ఐసీసీ తన ఎక్స్‌లో పోస్ట్ చేసింది. అయితే కోహ్లీ పలు స్టిల్స్ ఇచ్చిన పిక్స్ పోస్ట్ చేసింది. ఐసీసీ పోస్ట్ చేసిన ఫోటోలలో విరాట్ గ్లోవ్, బ్యాట్ పట్టుకుని వెరైటీ స్టిల్స్ ఇచ్చాడు. ఇందుకు సంబందించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ పోటోలను చూసిన ఫాన్స్ ఫన్నీగా కామెంట్స్ పెడుతున్నారు. ‘విరాట్ భయ్యా.. సూపర్ స్టిల్స్’, ‘ప్రపంచకప్ కొట్టాలి’, ‘బ్రహ్మానందం మాదిరి స్టిల్స్ సూపర్’ అని కామెంట్స్ చేస్తున్నారు.

Also Read: ODI World Cup 2023: నేడు ఉప్పల్‌లో పాకిస్తాన్, నెదర్లాండ్స్‌ మ్యాచ్‌.. తుది జట్లు ఇవే! ఫాన్స్ సంగతేంటి?

విరాట్ కోహ్లీ మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. భారత్, ఆస్ట్రేలియా మ్యాచ్‌ను వీక్షించేందుకు టికెట్లు కొనడానికి చెన్నై స్టేడియం దగ్గరకు వచ్చిన ఓ దివ్యాంగ అభిమానిని కోహ్లీ కలిశాడు. కోహ్లీ అంటే ఎంతో అభిమానం ఉన్న దివ్యాంగ అభిమాని ఎంతో కష్టపడి వీల్‌ చైర్‌లో రాగా.. అతడిని కలిసి ఫొటో దిగాడు. అభిమాని ఇచ్చిన గిఫ్ట్‌ను తీసుకున్నాడు. దీంతో ఆ దివ్యాంగ అభిమాని ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ప్రస్తుతం ఇందుకుసంబంధించిన ఫొటోలు కూడా సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

Exit mobile version