Site icon NTV Telugu

ICC T20 World Cup: బంగ్లాదేశ్‌కు షాక్ ఇచ్చిన ఐసీసీ.. మ్యాచ్‌లు ఆడాలంటే భారత్‌కు రావాల్సిందే.. లేదంటే?

Icc

Icc

ICC T20 World Cup: టీ20 వరల్డ్ కప్ వేదిక మార్చాలన్న బంగ్లాదేశ్ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడాలంటే బంగ్లాదేశ్ జట్టు తప్పకుండా భారత్‌కు రావాల్సిందేనని స్పష్టం చేసింది. భారత్‌కు రాకపోతే పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తాజా సమాచారం ప్రకారం.. వర్చువల్ సమావేశంలో ఐసీసీ ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. భద్రతా కారణాల పేరుతో భారత్ కాకుండా శ్రీలంకాలో మ్యాచ్‌లు నిర్వహించాలన్న అభ్యర్థనను అంగీకరించబోమని ఐసీసీ తెల్చి చెప్పేసింది. టీ20 వరల్డ్ కప్ ఆడాలంటే భారత్‌కు రావడం తప్ప మరో మార్గం లేదని, లేకపోతే నష్టమేనని ఐసీసీ తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఐసీసీ తమ అభ్యర్థనను తిరస్కరించిన విషయం తమకు అధికారికంగా తెలియలేదని బీసీబీ వర్గాలు అంటున్నాయి.

READ MORE: Haryana: మగ బిడ్డ కోసం ఆరాటం.. 10 మంది కుమార్తెల తర్వాత…!

ఈ వివాదానికి ఐపీఎల్‌లో జరిగిన ఒక సంఘటన సైతం కారణం. కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు బంగ్లాదేశ్ ఫాస్ట్ బౌలర్ ముస్తాఫిజూర్ రెహ్మాన్‌ను బీసీసీఐ సూచనతో తొలగించింది. బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై భారత్‌లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవడంతో రెహ్మాన్‌పై వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిస్థితుల్లోనే బీసీసీఐ అతన్ని విడుదల చేసింది. దీంతో బంగ్లాదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో జోక్యం చేసుకుంది. ఫిబ్రవరి 7 నుంచి భారత్‌లో జరగనున్న టీ20 వరల్డ్ కప్‌ను బహిష్కరిస్తామని హెచ్చరికలు చేసింది. ఈ మేరకు ఐసీసీకి లేఖ రాసింది. భారత్‌లో తమ జట్టు మ్యాచ్‌లు ఆడదని, ఆ మ్యాచ్‌లను శ్రీలంకకు మార్చాలని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కోరింది. తమ ఆటగాళ్ల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. అయితే ఇప్పుడు ఐసీసీ తుది నిర్ణయం చెప్పేసింది. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడాలంటే బంగ్లాదేశ్ జట్టు భారత్‌కే రావాలని, వేదిక మార్పు ప్రశ్నే లేదని స్పష్టం చేసింది.

READ MORE: Amaravati: ఏపీలో రెండో విడత ల్యాండ్ పూలింగ్.. 20,494 ఎకరాలు సమీకరణ

Exit mobile version