T20 World Cup 2026: 2026 టీ20 వరల్డ్ కప్ చుట్టూ ఉద్రిక్తత నెలకొంది. ఈ టోర్నీ భారత్‌లో జరగాల్సి ఉండగా.. బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. తమ జట్టు భారత్ రాదని ప్రకటించింది. జనవరి 22న జరిగిన అంతర్గత సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీబీ తెలిపింది. ఇప్పటికే వరల్డ్ కప్‌లో ఆడాలంటే భారత్‌కు రావాల్సిందేనని ఐసీసీ స్పష్టం చేసింది. కాగా, నిన్న (జనవరి 21న) అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) బీసీబీ…
ICC T20 World Cup: టీ20 వరల్డ్ కప్ వేదిక మార్చాలన్న బంగ్లాదేశ్ డిమాండ్‌ను ఐసీసీ తిరస్కరించింది. వరల్డ్ కప్ మ్యాచ్‌లు ఆడాలంటే బంగ్లాదేశ్ జట్టు తప్పకుండా భారత్‌కు రావాల్సిందేనని స్పష్టం చేసింది. భారత్‌కు రాకపోతే పాయింట్లు కోల్పోవాల్సి ఉంటుందని హెచ్చరించింది. తాజా సమాచారం ప్రకారం.. వర్చువల్ సమావేశంలో ఐసీసీ ఈ విషయాన్ని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు తెలియజేసింది. భద్రతా కారణాల పేరుతో భారత్ కాకుండా శ్రీలంకాలో మ్యాచ్‌లు నిర్వహించాలన్న అభ్యర్థనను అంగీకరించబోమని ఐసీసీ తెల్చి చెప్పేసింది.…