ICC Rankings: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ చరిత్ర సృష్టించింది. మహిళల టీ20 అంతర్జాతీయ బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో మొదటిసారిగా ప్రపంచ నెం.1 స్థానం సాధించింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ అన్నబెల్ సదర్లాండ్‌ను వెనక్కి నెట్టి దీప్తి ఈ ఘనత సాధించింది. శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో ఆమె చూపిన అద్భుత ప్రదర్శన ఈ విజయానికి కారణమైంది. డిసెంబర్ 21న విశాఖపట్నంలోని ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో శ్రీలంకపై భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో దీప్తి శర్మ నాలుగు ఓవర్లలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి అత్యంత కట్టుదిట్టమైన బౌలింగ్ చేసింది. అలాగే శ్రీలంక బ్యాటర్ హసిని పెరెరా వికెట్ కూడా ఆమె ఖాతాలో వేసుకుంది.
ఈ ప్రదర్శనతో దీప్తి శర్మకు 737 రేటింగ్ పాయింట్లు వచ్చాయి. ఇది ఆస్ట్రేలియా బౌలర్ అన్నబెల్ సదర్లాండ్ కంటే ఒక పాయింట్ ఎక్కువ కావడంతో.. ఆమెను దాటుకుని టాప్ ర్యాంక్‌ను అందుకుంది. మరోవైపు ఇదే సమయంలో మహిళల క్రికెట్‌లో మరో కీలక మార్పు చోటుచేసుకుంది. దక్షిణాఫ్రికా కెప్టెన్ లారా వోల్వార్ట్, భారత వైస్ కెప్టెన్ స్మృతి మంధానా స్థానంలో ప్రపంచ నంబర్ వన్ వన్డే బ్యాటర్‌గా నిలిచింది.
Shivaji : నటుడు శివాజీకి మహిళా కమిషన్ షాక్.. కేసు నమోదు, విచారణకు హాజరు కావాలని ఆదేశం!
ఐర్లాండ్‌తో జరిగిన హోమ్ వైట్‌బాల్ సిరీస్‌లో వోల్వార్ట్ అద్భుత ఫామ్‌లో ఉంది. రెండో, మూడో వన్డేల్లో వరుసగా శతకాలు బాది తన జట్టును 3-0 సిరీస్ విజయానికి నడిపించింది. ఈ ప్రదర్శనతో వోల్వార్ట్ 820 రేటింగ్ పాయింట్లు సాధించి మంధానా (811 పాయింట్లు)ను అధిగమించి వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది.
Top of the world 📈
Congratulations to Deepti Sharma on becoming the No. 1⃣-ranked bowler in the ICC Women's T20I rankings for the first time 👏#TeamIndia | @Deepti_Sharma06 pic.twitter.com/S10s0MacGB
— BCCI Women (@BCCIWomen) December 23, 2025
