ICC T20 Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా జోరు.. టీ20ల్లో అభిషేక్, ఇషాన్ హవా.. బుమ్రాకు ప్రమోషన్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC T20 Rankings: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో టీమిండియా జోరు.. టీ20ల్లో అభిషేక్, ఇషాన్ హవా.. బుమ్రాకు ప్రమోషన్!
టీ20 ప్రపంచకప్ 2026 ముగిసిన తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మండలి (ICC) విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో భారత ఆటగాళ్లు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. ముఖ్యంగా యువ బ్యాటర్లు టాప్ స్థానాల్లో దూసుకుపోతుండగా, బౌలింగ్ విభాగంలో జస్ప్రీత్ బుమ్రా తన ర్యాంకును మెరుగుపరుచుకున్నాడు.
Also Read
- Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
- Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
- Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
- RCB Vs PBKS: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
టీ20ల్లో భారత బ్యాటర్ల దూసుకుడు..
టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత కుర్రాళ్లు సత్తా చాటుతున్నారు.. టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇదే సమయంలో ఇషాన్ కిషన్ రెండో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. తాజా రాంకింగ్స్‌లో తిలక్ వర్మ 7వ స్థానం నుంచి 6వ స్థానానికి, సంజూ శామ్సన్ 22వ స్థానం నుంచి 21వ స్థానానికి చేరుకున్నారు. టాప్ 10లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ కూడా తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు.
బౌలింగ్, ఆల్‌రౌండర్ విభాగాల్లోనూ..
ప్రపంచకప్‌లో అత్యధిక వికెట్లు తీసిన బుమ్రా, తాజా ర్యాంకింగ్స్‌లో 6వ స్థానం నుంచి 5వ స్థానానికి ఎగబాకాడు. బౌలింగ్ జాబితాలో వరుణ్ రెండో స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఇకపోతే ఆల్‌రౌండర్ల జాబితాలో టీమిండియా నుంచి ఏకైక ఆటగాడిగా హార్దిక్ రెండో స్థానంలో నిలిచాడు (జింబాబ్వేకు చెందిన సికందర్ రజా అగ్రస్థానంలో ఉన్నాడు).
పాకిస్థాన్‌పై గెలుపుతో దూసుకెళ్లిన బంగ్లాదేశ్..
ఇటీవల పాకిస్థాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న బంగ్లాదేశ్‌కు ర్యాంకింగ్స్‌లో భారీ ప్రయోజనం చేకూరింది. వన్డే టీమ్ ర్యాంకింగ్స్‌లో బంగ్లాదేశ్ 10వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకోగా, వెస్టిండీస్ 10వ స్థానానికి పడిపోయింది. బంగ్లా కెప్టెన్ మెహిదీ హసన్ మిరాజ్ వన్డే బౌలర్ల జాబితాలో 9 స్థానాలు ఎగబాకి 7వ స్థానానికి చేరుకున్నాడు. పాకిస్థాన్ బ్యాటర్ సల్మాన్ 10వ స్థానానికి చేరుకుని టాప్ 10 వన్డే బ్యాటర్లలో చోటు సంపాదించుకున్నాడు.
నంబర్ 1గా టీమిండియా
ప్రస్తుతం ఐసీసీ టీమ్ ర్యాంకింగ్స్‌లో భారత్ వన్డే, టీ20 ఫార్మాట్లలో నంబర్ 1 జట్టుగా తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. పాకిస్థాన్ ఓడిపోయినప్పటికీ నాలుగో స్థానంలోనే ఉండగా, వెస్టిండీస్ 10వ స్థానానికి పడిపోవడం 2027 వన్డే వరల్డ్ కప్ క్వాలిఫికేషన్ పరంగా ఆ జట్టుకు ఆందోళన కలిగించే అంశం.
White-ball stars from Bangladesh and New Zealand have been the big winners on the latest update to the ICC Men's Player Rankings 💪
Details 👇https://t.co/r6HBWeuHSG
— ICC (@ICC) March 18, 2026
READ ALSO: Iran Execution: ఇజ్రాయెల్ గూఢచారికి ఇరాన్ గడ్డపై ఉరిశిక్ష
తాజావార్తలు
-
Actor Vishal: ‘‘ఆయనకు ఏం తెలుసని మంత్రి పదవి ఇచ్చారు..?’’ సీఎం విజయ్‌పై విశాల్ ఘాటు వ్యాఖ్యలు..
-
Epstein: ఎప్స్టీన్ కేసులో సంచలనం.. వెలుగులోకి కొత్త బాధితులు..
-
Stock Market: భారత స్టాక్ మార్కెట్ నుంచి భారీగా విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ.. కారణం ఇదే..
-
Jet Lee OTT Release: సడన్ సర్ప్రైజ్.. ‘జెట్ లీ’ ఓటీటీ పార్ట్నర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ డేట్ ఇదే!
-
RCB Vs PBKS: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ఆర్సీబీ.. వరుసగా ఆరో ఓటమి చవిచూసిన పంజాబ్..
ట్రెండింగ్
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్‌తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..