ICC Player of the Month: ఐసీసీ “ప్లేయర్ ఆఫ్ ది మంత్” గా భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు..!

  • ఫిబ్రవరి నెలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు
  • భారత క్రికెటర్ అరుంధతి రెడ్డికి
  • పురుషుల విభాగంలో పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ అవార్డుకు..
Icc

Icc

ICC Player of the Month: ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను భారత క్రికెటర్ అరుంధతి రెడ్డి, పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అందుకున్నారు. భారత మీడియం పేస్ బౌలర్ అరుంధతి రెడ్డిని ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆ సిరీస్‌ లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.

Rajasthan Royals Sold Out: ఐపీఎల్ చరిత్రలోనే అతి పెద్ద డీల్.. రూ.15,000+ కోట్లకు రాజస్థాన్‌ రాయల్స్‌ అమ్మకం..!

ఆస్ట్రేలియా పర్యటనలో ఆమె బౌలింగ్‌తో మెరిసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 4/22, 2/30, 2/35 అద్భుత గణాంకాలతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌ గా నిలిచింది. ఆమె సగటు 10.87 కాగా, ఎకానమీ రేటు 7.25గా నమోదైంది. ఈ సందర్బంగా అరుంధతి రెడ్డి మాట్లాడుతూ.. “ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని, ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలవడంలో నా వంతు పాత్ర ఉండటం మరింత ప్రత్యేకం అని అన్నారు. ఆస్ట్రేలియాను వారి స్వదేశంలో ఓడించడం సులభం కాదు.. అందుకే ఈ అవార్డు మరింత విలువైనదని ఆమె పేర్కొన్నారు. ఈ సిరీస్ విజయం మా జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇంగ్లాండ్, వేల్స్‌లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్‌ కు ఇది మాకు మంచి ప్రిపరేషన్‌గా ఉంటుంది. మా జట్టు సమతౌల్యంగా ఉంది. మేము తప్పకుండా గమనించాల్సిన జట్టుగా నిలుస్తామని ఆమె అన్నారు.

Sanjay Dutt : సీఎం చంద్రబాబుతో సంజయ్ దత్ భేటీ

ఇక పురుషుల విభాగంలో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో అతను అద్భుత ప్రదర్శనకు గాను ఈ అవార్డు లభించింది. ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగుల విషయంలో విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించి, టోర్నీలో రెండు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సెంచరీలను నమీబియా, శ్రీలంకపై నమోదు చేశాడు. ఫర్హాన్ ఏడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 383 పరుగులు చేసి 76.6 సగటుతో, స్ట్రైక్ రేట్ 160.25తో రాణించాడు. ఈ ప్రదర్శనలతో అతను ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.