ICC Player of the Month: ఐసీసీ “ప్లేయర్ ఆఫ్ ది మంత్” గా భారత్, పాకిస్థాన్ ఆటగాళ్లు..!
- ఫిబ్రవరి నెలకు ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులు
- భారత క్రికెటర్ అరుంధతి రెడ్డికి
- పురుషుల విభాగంలో పాకిస్థాన్ ఆటగాడు సాహిబ్జాదా ఫర్హాన్ అవార్డుకు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Player of the Month: ఫిబ్రవరి నెలకు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డులను భారత క్రికెటర్ అరుంధతి రెడ్డి, పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ అందుకున్నారు. భారత మీడియం పేస్ బౌలర్ అరుంధతి రెడ్డిని ఆస్ట్రేలియాలో జరిగిన టీ20 అంతర్జాతీయ సిరీస్‌లో అద్భుత ప్రదర్శనకు గాను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆ సిరీస్ లో భారత్ 2-1 తేడాతో విజయం సాధించడంలో ఆమె కీలక పాత్ర పోషించింది.
Also Read
ఆస్ట్రేలియా పర్యటనలో ఆమె బౌలింగ్‌తో మెరిసింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 4/22, 2/30, 2/35 అద్భుత గణాంకాలతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా నిలిచింది. ఆమె సగటు 10.87 కాగా, ఎకానమీ రేటు 7.25గా నమోదైంది. ఈ సందర్బంగా అరుంధతి రెడ్డి మాట్లాడుతూ.. “ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్‌గా ఎంపిక కావడం చాలా ఆనందంగా ఉందని, ముఖ్యంగా ఆస్ట్రేలియా గడ్డపై సిరీస్ గెలవడంలో నా వంతు పాత్ర ఉండటం మరింత ప్రత్యేకం అని అన్నారు. ఆస్ట్రేలియాను వారి స్వదేశంలో ఓడించడం సులభం కాదు.. అందుకే ఈ అవార్డు మరింత విలువైనదని ఆమె పేర్కొన్నారు. ఈ సిరీస్ విజయం మా జట్టుకు ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చింది. ఇంగ్లాండ్, వేల్స్‌లో జరగనున్న ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ కు ఇది మాకు మంచి ప్రిపరేషన్‌గా ఉంటుంది. మా జట్టు సమతౌల్యంగా ఉంది. మేము తప్పకుండా గమనించాల్సిన జట్టుగా నిలుస్తామని ఆమె అన్నారు.
Sanjay Dutt : సీఎం చంద్రబాబుతో సంజయ్ దత్ భేటీ
ఇక పురుషుల విభాగంలో పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ ఈ అవార్డును గెలుచుకున్నాడు. పురుషుల టీ20 వరల్డ్ కప్‌లో అతను అద్భుత ప్రదర్శనకు గాను ఈ అవార్డు లభించింది. ఒకే ఎడిషన్‌లో అత్యధిక పరుగుల విషయంలో విరాట్ కోహ్లీ రికార్డును అధిగమించి, టోర్నీలో రెండు సెంచరీలు సాధించిన తొలి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఈ సెంచరీలను నమీబియా, శ్రీలంకపై నమోదు చేశాడు. ఫర్హాన్ ఏడు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో 383 పరుగులు చేసి 76.6 సగటుతో, స్ట్రైక్ రేట్ 160.25తో రాణించాడు. ఈ ప్రదర్శనలతో అతను ఈ అవార్డుకు ఎంపికయ్యాడు.
తాజావార్తలు
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!