NTV Telugu Site icon

2023 World Cup Tickets: నేడే ప్రపంచకప్ 2023 టిక్కెట్ల రిజిస్ట్రేషన్.. ఎప్పుడు, ఎక్కడంటే?

Icc Odi World Cup 2023

Icc Odi World Cup 2023

Registration of ICC ODI World Cup 2023 Tickets will start from Today 3.30 PM on ICC Website: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఆరంభానికి ఇంకా 50 రోజులు మాత్రమే ఉంది. భారత్‌ గడ్డపై అక్టోబరు-నవంబరులో మెగా టోర్నీ జరగనుంది. అక్టోబర్‌ 5న ఆరంభం కానున్న ప్రపంచకప్‌ 2023 మ్యాచ్‌లకు సంబంధించిన టిక్కెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ ఇప్పటికే అధికారికంగా వెల్లడించింది. అయితే మెగా టోర్నీ టిక్కెట్లు కొనాలనుకునేవారు నేటి (ఆగస్టు 15) నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. https://www.cricketworldcup.com/register పేజీ లేదా ఐసీసీ వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

ఆగస్టు 15న మధ్యాహ్నం 3.30 నుంచి ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023కి సంబందించిన టిక్కెట్ల రిజిస్ట్రేషన్ ప్రారంభమవుతుంది. రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే టిక్కెట్ కొనుగోలు చేయొచ్చు. ఫాన్స్ ఇక ఆలస్యం ఎందుకు మరి.. సిద్ధంగా ఉండండి. మెగా టోర్నీకి ఈ-టిక్కెట్ ఆప్షన్‌ లేదు. అభిమానులు కచ్చితంగా బాక్స్ ఆఫీస్ కౌంటర్ల నుంచి టిక్కెట్లను తీసుకోవాల్సి ఉంటుంది. ఇక టిక్కెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుంది.

ఈ మెగా వెంట్‌కు ‘బుక్‌మైషో’ అధికారిక టిక్కెట్ భాగస్వామి అని సమాచారం తెలుస్తోంది. తాజాగా బుక్‌మైషోతో డీల్ పూర్తయిందట. ఈ నేపథ్యంలో ప్రపంచకప్‌కు అధికారిక టిక్కెట్ భాగస్వామిగా బుక్‌మైషోను ఐసీసీ, బీసీసీఐ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. ఇదే నిజమైతే బుక్‌మైషోలో అభిమానులు తమ ఇష్టమైన గేమ్ కోసం టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.

వన్డే ప్రపంచప్‌ 2023 మ్యాచ్‌ల టిక్కెట్ల అమ్మకాలను ఐసీసీ రెండు రకాలుగా విభజించింది. భారత్‌ ఆడే వామప్, ప్రధాన మ్యాచ్‌లు.. భారత్‌ ఆడని ఇతర మ్యాచ్‌లు అని రెండు రకాలుగా టిక్కెట్ల అమ్మకాలు ఉంటాయి. భారత్‌ ఆడే 9 లీగ్‌ మ్యాచ్‌ల టికెట్లు 6 వేర్వేరు దశల్లో అమ్మకానికి ఉన్నాయి. ఆగస్టు 25న హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌ల టిక్కెట్లు అమ్మకానికి ఉంటాయి.

Also Read: Jasprit Bumrah Back: ఐర్లాండ్‌కు టీమిండియా.. కెప్టెన్‌ జస్ప్రీత్ బుమ్రా లుక్ వైరల్!

టికెట్ల అమ్మకపు తేదీలు:
25 ఆగస్టు: భారత్‌ మినహా మిగతా జట్ల వామప్‌ మ్యాచ్‌లు, భారత్‌ మినహా ప్రధాన మ్యాచ్‌లు
30 ఆగస్టు: భారత్‌ వామప్‌ మ్యాచ్‌లు (గువహటి, తిరువనంతపురం)
31 ఆగస్టు: భారత్‌ మ్యాచ్‌లు (చెన్నై-ఆస్ట్రేలియా), (ఢిల్లీ-అఫ్గానిస్తాన్‌), (పుణే-బంగ్లాదేశ్)
1 సెప్టెంబర్‌: భారత్‌ మ్యాచ్‌లు (ధర్మశాల-న్యూజిలాండ్‌), (లక్నో-ఇంగ్లండ్‌), (ముంబై-శ్రీలంక)
2 సెప్టెంబర్‌: భారత్‌ మ్యాచ్‌లు (బెంగళూరు-నెదర్లాండ్స్‌), (కోల్‌కతా-దక్షిణాఫ్రికా)
3 సెప్టెంబర్‌: భారత్‌ మ్యాచ్‌ (అహ్మదాబాద్‌-పాకిస్తాన్‌)
15 సెప్టెంబర్‌: సెమీ ఫైనల్స్, ఫైనల్‌ మ్యాచ్‌లు