India-Pakistan match ICC ODI World Cup 2023 Tickets to be on sale from September 3: భారత్ వేదికగా అక్టోబరు-నవంబరులో ఐసీసీ వన్డే ప్రపంచప్ 2023 జరగనుంది. ఈ మెగా టోర్నీ మ్యాచ్‌లకు సంబంధించిన టికెట్ల విక్రయం ఆగస్టు 25 నుంచి ప్రారంభమవుతుందని ఐసీసీ, బీసీసీఐ అధికారికంగా వెల్లడించాయి. టోర్నీ ఆరంభానికి 41 రోజుల ముందునుంచి ప్రేక్షకుల కోసం టికెట్లను అమ్మకానికి ఉంచాయి. అయితే వన్డే ప్రపంచప్ టికెట్లు కొనాలనుకునేవారు ఆగస్టు 15 నుంచి https://www.cricketworldcup.com/register పేజీలో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్టర్ చేసుకుంటే.. అందరికంటే ముందే టికెట్ల వివరాలు తెలుసుకోవచ్చు.
వన్డే ప్రపంచప్ 2023 మ్యాచ్‌ల టికెట్ల అమ్మకాలను ఐసీసీ రెండు రకాలుగా విభజించింది. భారత్ ఆడే వామప్, ప్రధాన మ్యాచ్‌లు.. భారత్ ఆడని ఇతర మ్యాచ్‌లు అని రెండు రకాలుగా టికెట్ల అమ్మకాలు ఉంటాయి. భారత్ ఆడే 9 లీగ్ మ్యాచ్‌ల టికెట్లు ఆరు వేర్వేరు దశల్లో అమ్మకానికి అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌లో భారత్ ఆడే మ్యాచ్‌లు లేవన్న విషయం తెలిసిందే. ఆగస్టు 25న హైదరాబాద్‌లో జరిగే మ్యాచ్‌ల టికెట్లు అమ్మకానికి ఉంటాయి. మెగా టోర్నీకి ఈ-టికెట్ ఆప్షన్ లేదని ఐసీసీ స్పష్టం చేసింది. అభిమానులు కచ్చితమగు బాక్స్ ఆఫీస్ కౌంటర్ల నుంచి టికెట్లను తీసుకోవాల్సిందే.
టికెట్ల అమ్మకపు తేదీలు:
25 ఆగస్టు: భారత్ మినహా మిగతా జట్ల వామప్ మ్యాచ్‌లు, భారత్ మినహా ప్రధాన మ్యాచ్‌లు
30 ఆగస్టు: భారత్ వామప్ మ్యాచ్‌లు (గువహటి, తిరువనంతపురం)
31 ఆగస్టు: భారత్ మ్యాచ్‌లు (చెన్నై-ఆస్ట్రేలియా), (ఢిల్లీ-అఫ్గానిస్తాన్), (పుణే-బంగ్లాదేశ్)
1 సెప్టెంబర్: భారత్ మ్యాచ్‌లు (ధర్మశాల-న్యూజిలాండ్), (లక్నో-ఇంగ్లండ్), (ముంబై-శ్రీలంక)
2 సెప్టెంబర్: భారత్ మ్యాచ్‌లు (బెంగళూరు-నెదర్లాండ్స్), (కోల్‌కతా-దక్షిణాఫ్రికా)
3 సెప్టెంబర్: భారత్ మ్యాచ్ (అహ్మదాబాద్-పాకిస్తాన్)
15 సెప్టెంబర్: సెమీ ఫైనల్స్, ఫైనల్ మ్యాచ్‌లు