NTV Telugu Site icon

World Cup 2023 Schedule: వన్డే ప్రపంచకప్‌ మ్యాచ్‌ల తేదీల్లో మార్పులు.. టీమిండియా షెడ్యూల్‌ ఇదే!

India T20 Team

India T20 Team

Team India Schedule for ICC ODI World Cup 2023: వన్డే ప్రపంచకప్‌ 2023కు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను ఐసీసీ బుధవారం రాత్రి అధికారికంగా ప్రకటించింది. మెగా టోర్నీలో 9 మ్యాచ్‌ల తేదీల్లో లేదా ఆరంభ సమయాల్లో మార్పులు జరిగాయి. టోర్నమెంట్‌కే హైలైట్‌ మ్యాచ్‌ అయిన భారత్‌-పాకిస్థాన్‌ పోరు అక్టోబరు 15కు బదులుగా.. అక్టోబరు 14న జరగనుంది. అదేవిధంగా నవంబర్ 12న భారత్‌-నెదర్లాండ్స్‌ మధ్య బెంగళూరులో జరగాల్సిన మ్యాచ్‌.. నవంబర్ 11కు మారింది.

భారత్‌, పాకిస్తాన్ మ్యాచ్‌ తేదీ మారనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్‌లో నవరాత్రి ఉత్సవాల కారణంగా ఇండో-పాక్ మ్యాచ్‌కు సెక్యూరిటీ ఇవ్వడం కష్టంగా మారుతుందని భారత సెక్యూరిటీ బీసీసీఐని కోరింది. ఈ అభ్యర్థనను పరిగణలోకి తీసుకున్న బీసీసీఐ.. మ్యాచ్ తేదీని ఒకరోజుకు ముందుకు జరిపింది. పాకిస్థాన్‌, ఇంగ్లండ్ జట్లకు సంబంధించి మూడేసి మ్యాచ్‌లు రీషెడ్యూల్ అయ్యాయి. పాకిస్థాన్‌, శ్రీలంక మధ్య హైదరాబాద్‌లో అక్టోబరు 11న జరగాల్సిన మ్యాచ్‌.. అక్టోబరు 10న జరగనుంది.

Also Read: World Cup 2023 Tickets: వన్డే ప్రపంచకప్‌ టికెట్స్ రెడీ.. ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందే!

ప్రపంచకప్‌ 2023లో భారత్ తన ప్రయాణాన్ని అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో ఆరంభిస్తుంది. ఢిల్లీలో అక్టోబర్ 11న ఆఫ్ఘనిస్తాన్‌తో, అక్టోబర్ 14న అహ్మదాబాద్‌లో పాకిస్తాన్‌తో, అక్టోబర్ 19న పూణేలో బంగ్లాదేశ్‌తో, అక్టోబర్ 22న ధర్మశాలలో న్యూజీలాండ్‌తో, అక్టోబర్ 29న లక్నోలో ఇంగ్లండ్‌తో, నవంబర్ 2న ముంబైలో శ్రీలంకతో, నవంబర్ 5న కోల్‌కతాలో దక్షిణాఫ్రికాతో, నవంబర్ 12న బెంగళూరులో నెదర్లాండ్‌తో భారత్ తలపడనుంది.

Show comments