ICC: న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో ఉత్తమ ప్రదర్శనకు గాను టీమ్‌ఇండియా యువ ఆటగాళ్లు శ్రేయస్ అయ్యర్, శుభ్‌మన్ గిల్ మరో ఘనత సాధించారు. ఐసీసీ బుధవారం ప్రకటించిన వన్డే ర్యాంకింగ్స్‌లో ఈ బ్యాటర్లు తమ స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. ఐసీసీ వన్డే ర్యాంకుల్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ కోహ్లీ ర్యాంకులు దిగజారాయి. తాజాగా విడుదల చేసిన ర్యాంకింగ్స్ ప్రకారం కోహ్లీ 707 రేటింగ్ పాయింట్లతో 8వ స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ 704 రేటింగ్ పాయింట్లతో 9వ స్థానాన్ని దక్కించుకున్నాడు.
Read Also: Gujarat Polls: సైకిల్ కు సిలిండర్ కట్టుకుని ఓటేసేందుకు వచ్చిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
కివీస్ సిరీస్లో రాణించిన శ్రేయస్ అయ్యర్ 6 స్థానాలు మెరుగై 27వ ర్యాంక్‌లో నిలిచాడు. శుభమన్ గిల్ 3 స్థానాలు ఎగబాకిన 34వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. అటు వన్డే తాత్కాలిక కెప్టెన్ శిఖర్ ధావన్ రెండు స్థానాలు దిగజారి 15వ స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్ బ్యాటర్లు టామ్ లాథమ్, కేన్ విలియమ్సన్ సైతం ఒక స్థానం పురోగతిని సాధించారు. తొలి వన్డేలో సెంచరీ చేసిన లాథమ్ 18వ ర్యాంక్‌ను దక్కించుకున్నాడు. 98 బంతుల్లో 94 పరుగులతో అజేయంగా నిలిచిన కెప్టెన్ విలియమ్సన్ టాప్ 10లో నిలిచాడు. వన్డే ర్యాంకింగ్స్లో పాక్ ప్లేయర్లు కెప్టెన్ బాబర్ ఆజమ్ నెంబర్ వన్లో కొనసాగుతుండగా.. ఇమామ్ ఉల్ హక్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆల్ రౌండర్ జాబితాలో భారత క్రికెటర్లు టాప్-10లో ఒక్కరు కూడా లేకపోవడం గమనార్హం.