NTV Telugu Site icon

Bangladesh: ఓటమి బాధలో ఉన్న బంగ్లాదేశ్‌కు మరో షాక్‌!

Bangladesh

Bangladesh

Bangladesh Fined for Slow Over-rate vs England: ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మంగళవారం ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన బంగ్లాదేశ్‌కు షాక్‌ తగిలింది. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్‌రేట్‌ను నమోదు చేసినందుకు బంగ్లాదేశ్‌పై ఐసీసీ చర్యలు తీసుకుంది. స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా బంగ్లా జట్టు ఆటగాళ్ల మ్యాచ్‌ ఫీజ్‌లో 5 శాతం కోత విధించింది. నిర్ధేశిత సమయంలో బంగ్లాదేశ్‌ జట్టు ఓ ఓవర్‌ తక్కువగా వేయడంతో ఐసీసీ ఈ ఫైన్‌ విధించింది.

ఎమిరేట్స్ ఐసీసీ ఎలైట్ ప్యానెల్ ఆఫ్ మ్యాచ్ రిఫరీ జవగల్ శ్రీనాథ్ బంగ్లాదేశ్‌పై చర్యలు తీసుకున్నారు. ఐసీసీ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌ ఆర్టికల్‌ 2.22 ప్రకారం. బంగ్లా ఆటగాళ్లందరికీ ఈ ఫైన్‌ వర్తిస్తుంది. ఆర్టికల్ 2.22 ప్రకారం.. నిర్ణీత సమయంలో బౌలింగ్ చేయడంలో విఫలమైన ప్రతి ఓవర్‌కు ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 5 శాతం జరిమానా విధించబడుతుంది. ఆన్‌ఫీల్డ్‌ అంపైర్లు ఎహసాన్‌ రజా, పాల్‌ విల్సన్‌.. థర్డ్‌ అంపైర్‌ అడ్రియన్‌ హోల్డ్‌స్టాక్‌, ఫోర్త్‌ అంపైర్‌ కుమార ధర్మసేన బంగ్లా ఆటగాళ్లపై ఛార్జ్‌ తీసుకున్నారు. ఐసీసీ విధించిన ఈ జరిమానాను బంగ్లా కెప్టెన్‌ షకీబుల్ హసన్ అంగీకరించాడు. దీంతో ఐసీసీ ప్యానెల్‌ ముందు హాజరుకు అతనికి మినహాయింపు లభించింది.

Also Read: Satwiksairaj: ఏషియన్ మెడల్ ట్రయల్ మాత్రమే.. నా టార్గెట్ అదే: సాత్విక్

ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లా 137 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 364 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. డేవిడ్‌ మలాన్‌ (140) సెంచరీ చేశాడు. అనంతరం భారీ లక్ష్య ఛేదనకు దిగిన బంగ్లా 48.2 ఓవర్లలో 227 పరుగులు మాత్రమే చేసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో లిటన్‌ దాస్‌ (76) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. రీస్‌ టాప్లే (10-1-43-4) బంగ్లా పతనాన్ని శాశించాడు.