ICC Fines SuryaKumar Yadav: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) భారత T20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌కు జరిమానా విధించింది. అతని మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధిస్తూ నిర్ణయం తీసుకుంది. 2025 ఆసియా కప్‌లో పాకిస్థాన్‌తో జరిగిన గ్రూప్ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ విజయాన్ని పహల్గామ్ దాడి బాధితులకు, భారత సైన్యానికి అంకితం చేసిన విషయం తెలిసిందే. సూర్యకుమార్ యాదవ్ ప్రకటన రాజకీయ ప్రేరేపితమని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) ఐసీసీకి ఫిర్యాదు చేసింది. భారత కెప్టెన్ అభిమానుల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఈ ప్రకటన చేసినప్పటికీ.. పాకిస్థాన్ జట్టు ఉద్దేశపూర్వకంగా దీనిపై గందరగోళాన్ని సృష్టించింది. సూర్యకుమార్ యాదవ్ కరచాలనం చేయకుండా ఆట స్ఫూర్తిని ఉల్లంఘించాడని ఫిర్యాదులో పేర్కొంది. దీంతో సుర్యకుమార్ యాదవ్ పై ఈ చర్య తీసుకుంది. కాగా.. ఈ అంశంపై ఇటు బీసీసీఐ స్పందించింది. ఐసీసీ తీసుకున్న నిర్ణయాన్ని భారత క్రికెట్ నియంత్రణ బోర్డు సవాలు చేసింది.
READ MORE: Condom Sales Iran Crisis: ఇదేంది ఇది! క్రైసిస్ టైంలో రికార్డ్ బ్రేకింగ్ కండోమ్స్ సేల్.. ఎక్కడంటే?
మరోవైపు.. పాకిస్థాన్ క్రికెటర్లు హారిస్ రవూఫ్, సాహిబ్జాదా ఫర్హాన్‌లపై ఐసీసీ గతంలో చర్యలు తీసుకుంది. హారిస్‌కు మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానా విధించగా, సాహిబ్జాదా ఫర్హాన్‌ను మందలించింది. సూపర్ ఫోర్ మ్యాచ్ సందర్భంగా హారిస్ రవూఫ్ అభ్యంతరకరమైన హావభావాలు వ్యక్త పరిచాడు. అలాగే భారత ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్‌లతో కూడా గొడవపడ్డాడు. మరోవైపు, ఫర్హాన్ “తుపాకీ వేడుక”తో భారత ఆటగాళ్లను రెచ్చగొట్టడానికి ప్రయత్నించాడు.
READ MORE: Khalistani terrorist: “ఢిల్లీ ఖలిస్తాన్ అవుతుంది”.. అజిత్ దోవల్‌కు టెర్రరిస్టు బెదిరింపులు..
పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్ తో మ్యాచ్‌ను భారత్ బహిష్కరించాలనే డిమాండ్ల నడుమ తొలి మ్యాచ్ జరిగింది. టీమ్‌ఇండియా ఏడు వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించింది. పాక్ నిర్దేశించిన 128 పరుగుల లక్ష్యాన్ని 15.5 ఓవర్లలోనే ఛేదించిన భారత ఘన విజయం సాధించింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్, మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ సల్మాన్ అఘాతో సూర్యకుమార్ కరచాలనం చేయలేదు. దీంతో షేక్‌హ్యాండ్ వివాదం నెలకొంది. మ్యాచ్ ముగిశాక సూర్యకుమార్ మాట్లాడుతూ.. ఈ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులు, సాయుధ బలగాలకు అంకితమిస్తున్నట్లు చెప్పాడు.