Marcus Stoinis Might Miss IND vs AUS World Cup 2023 Match: ఐసీసీ వన్డే ప్రపంచకప్ 2023 ఈ రోజు ఆరంభం కానుంది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న టోర్నీ మొదటి మ్యాచ్‌లో ఇంగ్లండ్, న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచి టోర్నీలో శుభారంభం చేయాలని ఇరు జట్లు చూస్తున్నాయి. ఇక ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు జట్ల తుది టీమ్స్ ఎలా ఉంటాయో అని అందరూ ఆసక్తిగా ఉన్నారు. ఈ క్రమంలో భారత్‌తో మ్యాచ్ కోసం ఆస్ట్రేలియా ప్లేయింగ్ ఎలెవన్‌ను ఆ జట్టు మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ ఎంపిక చేశాడు.
ప్రపంచకప్ 2023కి ఎంపిక చేసిన జట్టులోని చాలా మంది ప్లేయర్స్ తుది జట్టులో తమ స్ధానాలను సుస్ధిరం చేసుకున్నారని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. ఆరో బౌలింగ్ ఆప్షన్ కోసం మార్కస్ స్టోయినిస్, కామెరాన్ గ్రీన్ మధ్య తీవ్ర పోటీ ఉందని తెలిపాడు. అయితే భారత్‌తో మ్యాచ్‌కు స్టోయినిస్‌ను ఫించ్ ఎంచుకోలేదు. టీమిండియాతో మ్యాచ్‌కు స్టార్ ఆల్‌రౌండర్ స్టోయినిస్ దూరం కానున్నట్లు సమాచారం తెలుస్తోంది. స్టోయినిస్ ప్రస్తుతం చేతి వేలి గాయంతో బాధపడుతున్నాడని ఆసీస్ మీడియా వర్గాలు పేర్కొన్నాయి. అందుకే ఫించ్ అతడిని జట్టులోకి తీసుకోలేదని తెలుస్తోంది.
Also Read: Venkata Swamy: బడుగు బలహీన వర్గాల ప్రజల్లో వెలుగులు నింపిన వ్యక్తి కాకా!
ఆరోన్ ఫించ్ ఏమికా చేసిన ఆస్ట్రేలియా తుది జట్టు:
డేవిడ్ వార్నర్, మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్, గ్లెన్ మాక్స్‌వెల్, అలెక్స్ క్యారీ, కామెరాన్ గ్రీన్, ఆడమ్ జంపా, ప్యాట్ కమ్మిన్స్ (కెప్టెన్), మిచెల్ స్టార్క్, జొస్ హాజిల్‌వుడ్.