ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ అద్భుతంగా ఆరంభించింది. పాక్ 241 పరుగులకు ఆలౌటైంది. ఈ మ్యాచ్ గెలవాలంటే భారత్ 242 పరుగులు పూర్తి చేయాల్సి ఉంది. రోహిత్ శర్మ 20 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. శుభ్‌మన్ గిల్ 46 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. మరోవైపు విరాట్ కోహ్లీ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. 27వ ఓవర్ మొదటి బంతిలో అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. తన వన్డే కెరీర్‌లో 14 వేల పరుగులు కూడా పూర్తి చేశాడు. 28 ఓవర్ల తర్వాత భారత్ స్కోరు:140-2గా ఉంది.
-
పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం
పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం సాధించింది. 42.3 ఓవర్‌కు ఫోర్ బాదిన కోహ్లీ.. ఈ క్రమంలోనే సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ..
-
IND vs PAK: విజయానికి 4 పరుగులు అవసరం.
షాహీన్ అఫ్రిది 42 ఓవర్ పూర్తి చేశాడు. కోహ్లీ 94 పరుగులు చేశాడు. 42 ఓవర్ల తర్వాత స్కోరు:
238-4. విజయానికి 4 పరుగులు అవసరం.
-
IND vs PAK: హర్దిక్ పాండ్యా ఔట్
శ్రేయస్ అయ్యార్ అనంతరం బరిలోకి దిగిన హర్దిక్ పాండ్యా(8).. షాహీన్ అఫ్రిది వేసిన 39.6వ బాల్‌కి ఔట్ అయ్యాడు. రిజ్వాన్ కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో ఎడమచేతి వాటం బ్యాట్స్‌మన్ అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు.
-
IND vs PAK: ఆఫ్ సెంచరీ అనంతరం శ్రేయస్ అయ్యార్ ఔట్..
ఆఫ్ సెంచరీ అనంతరం శ్రేయస్ అయ్యార్ (56) ఔట్ అయ్యాడు. ఖుష్దిల్ వేసిన 38.5 వద్ద శ్రేయస్ క్యాచ్ ఔట్ అయి పెవిలియన్‌కు చేరుకున్నాడు. అనంతరం హార్దిక్ పాండ్యా క్రీజ్‌లోకి వచ్చాడు. 39 ఓవర్ల తర్వాత స్కోరు:215-3
-
IND vs PAK: శ్రేయాస్ అయ్యర్ ఆఫ్ సెంచరీ
శ్రేయాస్ అయ్యర్ ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 36.5 ఓవర్‌లో అర్ధ శతకం పూర్తి చేశాడు. అతడికి ఇది 21వ ఓడీఐ ఆఫ్ సెంచరీ.. కాగా.. 37వ ఓవర్‌లో భారత్ శ్రేయస్ ఒక్క పరుగు మాత్రమే సాధించాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 201కి చేరుకుంది.
-
IND vs PAK: 200లకు చేరుకున్న భారత్ స్కోర్..
35.6 వద్ద కోహ్లీ 2 పరుగులు తీశాడు. శ్రేయస్, విరాట్ భాగస్వామ్యంలో సెంచరీ పూర్తయింది. 36 ఓవర్ల తర్వాత స్కోరు 200లకు చేరుకుంది.
-
IND vs PAK: విజయానికి 53 పరుగులు చేరువలో టీమిండి..
విజయానికి 53 పరుగులు చేరువలో టీమిండి.. 35 ఓవర్లు పూర్తయ్యాయి. శ్రేయాస్ అయ్యర్ (48), విరాట్ కోహ్లీ (71) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు: 189-2
-
IND vs PAK: 32 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 175-2
సల్మాన్ అఘా వేసిన 31 ఓవర్‌లో శ్రేయాస్ అయ్యర్ సిక్స్ కొట్టాడు. ఈ ఓవర్‌లో 8 పరుగులు వచ్చాయి. 31.1 ఓవర్ వద్ద బంతిని శ్రేయాస్ అయ్యర్ బౌండ్రీకి తరలించాడు. 32 ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 175-2
-
IND vs PAK: క్రీజ్‌లో విరాట్, శ్రేయస్..
షాహీన్ అఫ్రిది 29 వేసిన ఓవర్‌లో పది పరుగులు వచ్చాయి. 30 ఓవర్‌లో శ్రేయాస్ అయ్యర్ వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. మరోవైపు విరాట్ కోహ్లీ కూడా చెలరేగుతున్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ (64), శ్రేయాస్ అయ్యర్ (27) పరుగులతో క్రీజ్‌లో కొనసాగుతున్నారు. 30 ఓవర్ల తర్వాత భారత్ స్కోరు: 160-2కి చేరింది.
-
IND vs PAK: విరాట్ ఆఫ్ సెంచరీ..
27వ ఓవర్ మొదటి బంతిలో విరాట్ కోహ్లీ ఆఫ్ సెంచరీ పూర్తి చేశాడు. దీంతో అభిమానుల ఆశలు చిగురించాయి. 27 ఓవర్ల తర్వాత భారత్ స్కోరు: 136-2
-
IND vs PAK: ముగిసిన 25 ఓవర్ల ఆట...
25 ఓవర్లు పూర్తయ్యాయి. 25 ఓవర్లు ముగిసేసరికి భారత్ 126 పరుగులు చేసింది. లక్ష్య సాధనకు ఇంకా 116 పరుగులు అవసరమవుతాయి. ప్రస్తుతం విరాట్ కోహ్లీ(46) ఆఫ్ సెంచరీకి దగ్గరగా ఉన్నాడు. శ్రేయస్ అయ్యార్ (11) పరుగులు చేశాడు.
-
IND vs PAK: చాకచక్యంగా కోహ్లీ, శ్రేయ ఆట..
భారత బ్యాటర్లు కోహ్లీ, శ్రేయస్ చాకచక్యంగా ఆడుతున్నారు. గత మూడు ఓవర్లలో 14 పరుగులు సాధించారు. 23 ఓవర్లకు భారత్ స్కోరు 123/2.
-
IND vs PAK: భారత్ విజయానికి ఇంకా 124 పరుగులు
20 ఓవర్(అబ్రార్ అహ్మద్) రెండు పరుగులు, 21 ఓవర్ (హారిస్ రౌఫ్)లో విరాట్ ఓ ఫోర్ కొట్టాడు. 21 ఓవర్‌లో మొత్తం ఆరు పరుగులు, 22 ఓవర్‌లో మూడు పరుగులు వచ్చాయి. 22 ఓవర్ల తర్వాత భారత్ స్కోరు: 118-2. భారత్ విజయానికి ఇంకా 124 పరుగులు అవసరం.
-
IND vs PAK: రెండు వికెట్లు కోల్పోయిన భారత్..
అబ్రార్ అహ్మద్ వేసిన 18 ఓవర్‌లో గిల్ అవుట్ అయిన విషయం తెసిందే. ఈ ఓవర్‌లో మూడు పరుగులు రాగా..19 ఓవర్లో 5 రన్స్ వచ్చాయి, హారిస్ రౌఫ్ బౌలింగ్ వేశాడు. ప్రస్తుతం ఇండియా స్కోర్: 107-2 కు చేరింది.
-
IND vs PAK: భారత్ విజయానికి 142 పరుగులు
100కు చేరిన టీమిండియా స్కోర్.. భారత్ విజయానికి ఇంకా 142 పరుగులు అవసరం.
-
IND vs PAK: శుభ్‌మాన్ గిల్ ఔట్..
శుభ్‌మాన్ గిల్(46) అబ్రార్ అహ్మద్ చేతిలో ఔట్ అయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ బరిలోకి దిగాడు.. అర్ధ శతకం చేయకుండానే గిల్ పెవిలియన్‌కు చేరుకున్నాడు..
-
IND vs PAK: ఆఫ్ సెంచరీ దిశగా గిల్...
IND vs PAK: ఖుష్దిల్ వేసిన 17 ఓవర్‌లో ఆరు పరుగులు వచ్చాయి. గిల్ ఆఫ్ సెంచరీకి చేరువలో ఉన్నాడు. ప్రస్తుతం శుభ్‌మాన్ గిల్ 46 (50), కోహ్లీ 30 (37) వద్ద కొనసాగుతున్నారు.
-
IND vs PAK: రెండు ఓవర్లలో కలిపి ఎన్ని రన్లు చేశారంటే?
ఖుష్దిల్ 15 ఓవర్‌లో కేవలం రెండు పరుగులు ఇచ్చాడు. మొదటి, చివరి బంతులకు సింగిల్ మాత్రమే వచ్చింది. అబ్రార్ అహ్మద్ వేసిన 16 ఓవర్‌లో కోహ్లీ మూడు, గిల్ ఒక్క పరుగు చేశాడు.. 16 ఓవర్ ముగిసే సరికి టీమిండియా స్కోరు: 93-1
-
IND vs PAK: 14 ఓవర్‌లో అబ్రార్ అహ్మద్ బౌలింగ్..
IND vs PAK: 14 ఓవర్‌లో అబ్రార్ అహ్మద్ బౌలింగ్... కేవలం మూడు పరుగులు సాధించిన ఇండియా టీం.. ఒక వికెట్ నష్టంతో 87 పరుగులు పూర్తి చేసుకున్న భారత్..
-
IND vs PAK: విరాట్ కోహ్లీ.. పెరిట మరో రికార్డు..
IND vs PAK: విరాట్ కోహ్లీ.. వన్డేల్లో 14,000 పరుగులు పూర్తి చేశాడు.14,000 పరుగుల మైలురాయిని అందుకున్నాడు.
-
IND vs PAK: కోహ్లీ ఖాతాలో రెండు ఫోర్లు..
IND vs PAK: హారిస్ రౌఫ్ వేసిన 13వ ఓవర్లో కోహ్లీ రెండు ఫోర్లు బాదాడు. ఈ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు సాధించింది. ప్రస్తుతం టీమిండియా స్కోరు: 84-1
-
IND vs PAK: 11,12 ఓవర్లలో మూడేసి పరుగులు..
IND vs PAK: హారిస్ రౌఫ్ వేసిన 11వ ఓవర్, అబ్రార్ అహ్మద్ వేసిన 12 ఓవర్‌లో మూడు చొప్పున పరుగులు వచ్చాయి. ప్రస్తుతం టీమిండియా స్కోరు: 70-1
-
IND vs PAK: 10వ ఓవర్‌లో ఒకే ఒక్క పరుగు
IND vs PAK: నసీమ్ షా వేసిన 10వ ఓవర్లో కోహ్లీ ఒకే ఒక్క పరుగు తీశాడు. 10 ఓవర్లకు స్కోరు 64/1. గిల్ (35), కోహ్లీ (6) పరుగులతో ఉన్నారు.
-
IND vs PAK: తొమ్మిదవ ఓవర్‌లో 14 పరుగులు
IND vs PAK: తొమ్మిదవ ఓవర్‌లో షాహీన్ అఫ్రిది రెండు వైడ్లు ఇచ్చాడు. ఈ ఓవర్‌లో మొత్తం 14 పరుగులు వచ్చాయి. ప్రస్తుతం టీమిండియా స్కోరు: 63-1
-
IND vs PAK: ఖాతా తెరిచిన కోహ్లీ...
నసీమ్ షా 8వ ఓవర్ పూర్తి చేశాడు.. ఈ ఓవర్లో కోహ్లీ ఖాతా తెరిచాడు. 8 ఓవర్ల తర్వాత భారత్ స్కోరు: 49-1
-
IND vs PAK: శుభ్‌మన్ దూకుడు..
శుభ్‌మన్ గిల్ తన ఆటలో దూకుడు ప్రదర్శిస్తున్నాడు. షహీన్ షా అఫ్రిది వేసిన ఏడో ఓవర్లో మూడు బౌండరీలు సాధించాడు. 7 ఓవర్లకు గాను భారత్ స్కోరు: 46/1.
-
IND vs PAK: క్రీజులోకి విరాట్ కోహ్లీ
IND vs PAK: ఏడో ఓవర్ ప్రారంభమైంది. నసీమ్ షా బౌలింగ్ వేస్తున్నాడు. బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. 6 ఓవర్ల తర్వాత ఇండియా స్కోరు: 32-1
-
IND vs PAK: ముగిసిన 5 ఓవర్.. భారత్ స్కోర్ 31/1
IND vs PAK: 5 ఓవర్ ముగిసింది. ఈ ఓవర్‌లో రోహిత్(20) ఔట్ అయ్యాడు. ప్రస్తుతం భారత్ స్కోరు 31/1గా ఉంది.
-
IND vs PAK: టీమిండియాకు బ్యాడ్ న్యూస్.. కెప్టెన్ ఔట్
IND vs PAK: షహీన్ షా అఫ్రిది వేసిన ఐదో ఓవర్లో 5వ బాల్‌కి రోహిత్ అవుటయ్యాడు. 20 పరుగులు చేసిన కెప్టెన్ రోహిత్ శర్మ చివరి బంతికి క్లీన్‌బౌల్డ్ అయ్యాడు.
-
IND vs PAK: రెండు బౌండరీలు బాదిన గిల్..
IND vs PAK: షహీన్ షా అఫ్రిది వేసిన మూడో ఓవర్లో శుభ్‌మన్ గిల్ ఖాతా ఓపేన్ చేశాడు. మొదటి బాల్‌కి ఫోర్ కొట్టాడు. ఐదో బాల్‌కి సైతం గిల్ బౌండరీ కొట్టాడు. మూడు ఓవర్లు ముగిసే సరికి భారత్ స్కోరు: 20/0.
-
IND vs PAK: చెలరేగుతున్న రోహిత్..
షహీన్ షా అఫ్రిది వేసిన మొదటి ఓవర్‌లో రెండు పరుగులు రాగా.. నసీమ్ షా వేసిన రెండో ఓవర్‌లో రోహిత్ ఒక ఫోర్, ఒక సిక్సర్ కొట్టాడు.
-
IND vs PAK: బరిలోకి దిగిన భారత్.. లక్ష్య చేధనకు సై..
IND vs PAK: రెండో ఇన్నింగ్స్ ప్రారంభమైంది. 242 టార్గెట్‌ను పూర్తి చేసేందుకు టీమిండియా రంగంలోకి దిగింది. రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగారు. షహీన్ షా అఫ్రిది తొలి ఓవర్ వేస్తున్నాడు.
-
IND vs PAK: చివరి ఓవర్‌లో వికెట్
IND vs PAK:షమి వేసిన 49 ఓవర్‌లో చివరి బంతికి రెండో పరుగు కోసం యత్నించి రవూఫ్ రనౌటయ్యాడు. 49 ఓవర్లకు స్కోరు 241/9.
-
IND vs PAK: మ్యాచ్‌ను తిలకిస్తున్న చిరంజీవి..
దుబాయ్‌లో జరుగుతున్న మ్యాచ్‌ను తిలకిస్తున్న సినీ నటుడు, పద్వవిభూషన్ చిరంజీవి..
-
IND vs PAK: 46.4 ఓవర్‌లో నసీమ్ షా (14) ఔటయ్యాడు
IND vs PAK: కుల్‌దీప్ యాదవ్ వేసిన 46.4 ఓవర్‌కు నసీమ్ షా (14) ఔటయ్యాడు. నసీమ్ షా.. కోహ్లీకి క్యాచ్ ఇచ్చాడు. 47 ఓవర్లకు స్కోరు 222/8.
-
IND vs PAK: విరాట్ కోహ్లీ క్యాచ్
IND vs PAK: 47 ఓవర్‌లో నసీమ్ షా పెవిలియన్‌కు చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ క్యాచ్ పట్టాడు.
-
IND vs PAK: షమీ వేసిన 46 ఓవర్‌లో ఏడు పరుగులు వచ్చాయి.
IND vs PAK: షమీ వేసిన 46 ఓవర్‌లో ఏడు పరుగులు వచ్చాయి.
-
రెండు ఓవర్లలో ఆరేసి పరుగులు
IND vs PAK: హర్షిత్ రానా 44వ ఓవర్ వేశాడు. ఆరు పరుగులు ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 45వ ఓవర్‌లో మరో ఆరు యాడ్ అయ్యియి.
-
IND vs PAK : 43వ ఓవర్‌లో సంచలనం
IND vs PAK: కుల్దీప్ యాదవ్ వేసిన 43వ ఓవర్‌లో సంచలనం సృష్టించాడు. ఒకే ఓవర్లో రెండు వికెట్లు తీశాడు. 42.5 బాల్ వద్ద షాహీన్ అఫ్రిది అయ్యాడు. పాకిస్థాన్ ఇప్పటి వరకు ఏడు వికెట్లు కోల్పోయింది.
-
IND vs PAK: 200కు చేరుకున్న పాక్ స్కోరు..
IND vs PAK: పాకిస్థాన్ స్కోరు 43వ ఓవర్‌లో 200లకు చేరుకుంది.
-
IND vs PAK: భారత్ ఖాతాలో ఆరో వికెట్..
IND vs PAK: భారత్ ఖాతాలో ఆరో వికెట్.. కుల్దీప్ వేసిన 43వ ఓవర్‌లో సల్మాన్ ఆఘా (19) క్యాచ్ అవుట్ అయ్యాడు.
-
IND vs PAK: అక్షర్ పటేల్ ఓవర్‌లో 9 రన్లు..
IND vs PAK: 42 వ ఓవర్లో తొమ్మిది పరుగులు వచ్చాయి. ఈ ఓవర్‌ను అక్షర్ పటేల్ పూర్తి చేశాడు. 42 ఓవర్లు పూర్తయ్యే సరికి పాక్ స్కోరు: 197-5
-
IND vs PAK: ప్రస్తుతం పాక్ స్కోరు : 188-5
IND vs PAK: కుల్దీప్ యాదవ్ 41 వ ఓవర్ వేశాడు. ఈ ఓవర్‌లో మొత్తం ఐదు రన్స్ వచ్చాయి. ప్రస్తుతం పాక్ స్కోరు : 188-5
-
IND vs PAK: అక్షర్ సూపత్రో.. అద్దిరింది..
𝘽𝙐𝙇𝙇𝙎𝙀𝙔𝙀! 🎯💥
Axar Patel with a stunning direct hit and Imam-ul-Haq is caught short! A moment of brilliance in the #GreatestRivalry—can Pakistan recover from this setback? 👀🔥#ChampionsTrophyOnJioStar 👉 🇮🇳 🆚 🇵🇰 | LIVE NOW on Star Sports 1, Star Sports 1 Hindi, Star… pic.twitter.com/vkrBMgrxTi
— Star Sports (@StarSportsIndia) February 23, 2025
-
IND vs PAK: నిలకడగా ఆడుతున్న పాక్ బ్యాటర్లు..
IND vs PAK: పాకిస్థాన్ బ్యాటర్లు ఆచితూచి ఆడుతున్నారు. 3 ఓవర్లలో16 పరుగులు తీశారు. 40 ఓవర్లకు స్కోరు 183/5కు చేరుకుంది.
-
మ్యాచ్‌ను ఏపీ మంత్రినారా లోకేష్, కేశినేని చిన్ని, సినీ దర్శకుడు సుకుమార్
దుబాయ్‌లో జరుగుతున్న భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను ఏపీ మంత్రినారా లోకేష్, ఎంపీ కేశినేని చిన్ని, సినీ దర్శకుడు సుకుమార్ వీక్షిస్తున్నారు.
-
IND vs PAK: ఈ ఓవర్‌లో ఏడు పరుగులు సాధించిన పాకిస్థాన్..
IND vs PAK: జడేజా 39వ ఓవర్ వేశాడు. ఈ ఓవర్‌లో పాకిస్థాన్ ఏడు పరుగులు సాధించింది. ప్రస్తుతం పాక్ స్కోరు : 177-5
-
IND vs PAK: 38 ఓవర్ల తర్వాత పాకిస్థాన్ స్కోరు: 170-5
IND vs PAK: భారత బౌలర్లు అద్దరగొడుతున్నారు. 38వ ఓవర్ వేసిన అక్షర్ పటేల్.. కేవలం మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. 38 ఓవర్ల తర్వాత పాకిస్థాన్ స్కోరు: 170-5
-
IND vs PAK: రెచ్చిపోతున్న భారత బౌలర్లు..
IND vs PAK: భారత బౌలర్లు రెచ్చి పోతున్నారు. తక్కువ కాల వ్యవధిలో మూడు వికెట్లు తీశారు. రవీంద్ర జడేజా వేసిన 36.1 ఓవర్‌కు తయ్యబ్ తాహిర్ (4) క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. 165 పరుగుల వద్ద పాక్ ఐదో వికెట్ కోల్పోయింది.
-
IND vs PAK: 37వ ఓవర్‌లో పాకిస్థాన్ 5వ వికెట్
IND vs PAK: 37వ ఓవర్‌లో పాకిస్థాన్ 5వ వికెట్ కోల్పోయింది. జడేజా తయ్యబ్ తాహిర్‌ను ఔట్ చేశాడు..