NTV Telugu Site icon

ICC Mens Player Of The Month: ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డును ఏ ఆటగాళ్లను వరించిందంటే..?

Icc

Icc

ఐసీసీ ప్రతి నెలా ప్రకటించే ప్రతిష్టాత్మక ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు కోసం పోటీ పడే వారిలో ఈ వరల్డ్‌కప్‌లో ఆడే ఆటగాళ్లు ఉన్నారు. అక్టోబర్‌ నెల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌గా ఇండియా తరుఫున జస్ప్రీత్ బుమ్రా, సౌతాఫ్రికాకు చెందిన క్వింటన్‌ డికాక్‌, న్యూజిలాండ్ కు చెందిన రచిన్‌ రవీంద్ర ప్రకటించబడ్డారు. ఈ ఆటగాళ్లు వరల్డ్ కప్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు మంచి ప్రదర్శన కొనసాగిస్తున్నారు. అయితే వీరు ప్రపంచకప్‌లో అత్యుత్తమ స్థాయిల్లో ఉన్నారు.

Read Also: Tirumala: రూటు మార్చిన వేటగాళ్లు.. కుక్కలతో వన్య ప్రాణుల వేట..

ఈ వరల్డ్‌కప్‌ లో క్వింటాన్ డికాక్‌ 8 మ్యాచ్‌ల్లో 4 సెంచరీలు బాదాడు. దీంతో టోర్నీలోనే అత్యధిక పరుగులు 550 చేసి లీడింగ్‌ రన్‌ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. రచిన్‌ రవీంద్ర కూడా 8 మ్యాచ్‌ల్లో 3 సెంచరీలు ఉన్నాయి. 523 పరుగులతో అత్యధిక పరుగుల జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. ఇక బౌలింగ్‌ విభాగంలో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్‌ బుమ్రా తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. బుమ్రా ఇప్పటివరకు ఆడిన 8 మ్యాచ్‌ల్లో 15 వికెట్లు తీశాడు. ఈ వరల్డ్‌కప్‌లో అత్యధిక వికెట్ల జాబితాలో ఆరో స్థానంలో ఉన్నాడు.

Read Also: Bharat Jodo Yatra 2.0: రెండో విడత భారత్ జోడో యాత్రకు కాంగ్రెస్ సిద్ధం.. అప్పటి నుంచేనా..?

మరోవైపు ఐసీసీ మహిళల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ నామినీస్‌ పేర్లను కూడా ప్రకటించింది. మహిళల విభాగంలో వెస్టిండీస్‌కు చెందిన హేలీ మాథ్యూస్‌, బంగ్లాదేశ్‌కు చెందిన నహీద అక్తర్‌, న్యూజిలాండ్‌కు చెందిన అమేలయా కెర్‌ ఈ అవార్డు రేసులో ఉన్నారు.