డబ్బులే.. డబ్బులు.. Women’s T20 World Cup 2026కు భారీ ప్రైజ్ మనీ ప్రకటించిన ICC..!
- మహిళల T20 వరల్డ్‌కప్ 2026కు రికార్డు ప్రైజ్ మనీ ప్రకటించింన ఐసీసీ
- మొత్తం ప్రైజ్ పూల్ $8.76 మిలియన్ (సుమారు 81 కోట్లు)
- విజేత జట్టుకు ₹21.8 కోట్లు, రన్నరప్‌కు 10 కోట్లు
- సెమీఫైనల్లో ఓడిన జట్లకు 6 కోట్లు చొప్పున
- గ్రూప్ దశలో ప్రతి విజయానికి 29 లక్షలు
- ప్రతి పాల్గొనే జట్టుకు కనీసం 2.3 కోట్లు
- 2024తో పోలిస్తే సుమారు 10% పెరిగిన ప్రైజ్ మనీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ICC Women’s T20 World Cup 2026: ప్రపంచవ్యాప్తంగా మహిళల క్రికెట్‌కు పెరుగుతున్న ఆదరణ నేపథ్యంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల టీ20 వరల్డ్‌కప్ 2026 కోసం రికార్డు స్థాయి ప్రైజ్ మనీని ప్రకటించింది. ఇంగ్లాండ్, వేల్స్ వేదికగా జరగనున్న ఈ టోర్నీ ప్రారంభానికి ఇంకా 60 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలుబడింది.
Lenovo: లెనోవా కొత్త గేమింగ్ ల్యాప్‌టాప్ లెకూ బెల్లేటర్ 7000 విడుదల.. ధర తక్కువ, పెర్ఫార్మెన్స్ హై!
Also Read
ఈసారి టీ20 వరల్డ్ కప్ కోసం మొత్తం ప్రైజ్ మొత్తాన్ని 8,764,615 డాలర్లు (రూ.81 కోట్లు)గా ఐసీసీ వెల్లడించింది. ఇక ప్రపంచకప్ విజేతగా నిలిచిన జట్టుకు రూ.21.8 కోట్లు, రన్నరప్ జట్టుకు రూ.10 కోట్లు దక్కనున్నాయి. సెమీస్ లో ఓడిపోయిన జట్లకు రూ.6 కోట్ల చొప్పున, అలాగే గ్రూప్ దశలో గెలిచిన ప్రతి జట్టుకు రూ.29 లక్షలు లభించనున్నాయి. అలాగే టోర్నీలో పాల్గొనే ప్రతి జట్టుకు కనీస చెల్లింపుగా రూ.2.3 కోట్లు ఇచ్చేలా ఐసీసీ నిర్ణయించింది. 2024 ఎడిషన్‌లో 7,958,077 డాలర్లు నగదు బహుమతి (రూ.70 కోట్లకు పైగా) ఉండగా.. ఈ సారి ఆ మొత్తాన్ని 10% వరకు పెంచింది ఐసీసీ.
ఈ విషయాన్నీ తెలుపుతూ ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా మాట్లాడారు. మహిళల క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందుతోందని, టోర్నీని 12 జట్లకు విస్తరించడం.. రికార్డు స్థాయి ప్రైజ్ మనీ ప్రకటించడం ద్వారా ప్రపంచ స్థాయిలో మరింత పోటీ వాతావరణాన్ని తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అన్నారు. మహిళా క్రీడాకారుల ప్రభావం ప్రపంచవ్యాప్తంగా పెరుగుతోందని, ఈ టోర్నీ కొత్త రికార్డులను నెలకొల్పే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మరోవైపు DP వరల్డ్‌తో కలిసి ఐసీసీ ట్రోఫీ టూర్ కూడా ప్రారంభమైంది. ఈ టూర్ లండన్‌లో ప్రారంభమై, ఫైనల్ మ్యాచ్ జరిగే లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ లో ట్రోఫీని ప్రదర్శించారు.
IPL 2026: ఐపీఎల్ 2026లో భారీ మార్పు.. మారిన జీటీ, సీఎస్కే మ్యాచ్‌ల షెడ్యూల్..
ఆ తర్వాత నెదర్లాండ్స్, ఐర్లాండ్, స్కాట్లాండ్ వంటి యూరప్ దేశాల్లో పర్యటించి, మే నెలలో ఇంగ్లాండ్ లోని పలు హోస్ట్ నగరాల్లో అభిమానులను అలరించనుంది. లీడ్స్, మాంచెస్టర్, బర్మింగ్‌హామ్, బ్రిస్టల్, సౌతాంప్టన్, లండన్ నగరాల్లో కీలక ప్రదేశాల్లో ట్రోఫీ ప్రదర్శనతో పాటు అభిమానులకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. జూన్ 12న ప్రారంభమయ్యే ఈ టోర్నీలో ఆతిథ్య జట్టు ఇంగ్లాండ్, శ్రీలంకతో బర్మింగ్‌హామ్ లోని ఎడ్జ్ బాస్టన్ మైదానంలో తొలి మ్యాచ్ ఆడనుంది.
తాజావార్తలు
-
OTR : కొందరు ‘దరిద్రుల’ వల్లే పార్టీ మారా!: పోచారం
-
Story Board : అమిత్ షా రాజీనామాకు రాహుల్ పట్టు.., కీలక బిల్లుల ముంగిట పార్లమెంట్ దారెటు?
-
HYDRAA : హైడ్రా కమిషనర్ రంగనాథ్‌కు హైకోర్టు ధిక్కరణ నోటీసులు..
-
OTR : కాణిపాకం సాక్షిగా ‘ప్రమాణాస్త్రం’.. ఇరకాటంలో అధికార టీడీపీ.!
-
CM Chandrababu: ఏపీ పోలీస్ కీర్తి దేశమంతా మార్మోగాలి
ట్రెండింగ్
-
Rahul Dravid Records: రాహుల్ ద్రవిడ్ ఈ 3 రికార్డులు ఎవరూ బ్రేక్ చేయలేరు.. సచిన్ వల్లనే సాధ్యం కాలేదు!
-
Homemade Anti-Aging Cream: ముఖంపై ముడతలు తగ్గి ‘గ్లో’ రావాలా..? ఇంకెందుకు ఆలస్యం ఈ హోంమేడ్ క్రీమ్ ట్రై చేయండి.!
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..