వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ కోసం ఐసీసీ… మ్యాచ్ అఫిషియల్స్ ను ప్రకటించింది. న్యూజిలాండ్‌కు చెందిన క్రిస్ గఫానీ, ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్‌లను ఆన్-ఫీల్డ్ అంపైర్లుగా నియమించారు. ఈ ఫీల్డ్ లో వారిద్దరికీ అపారమైన అనుభవం ఉంది. ఐసీసీ ఈవెంట్లలో ఎన్నో మ్యాచ్ లకు అంపైరింగ్ చేశారు. 2024 అంపైర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు గెలుచుకున్న రిచర్డ్ ఇల్లింగ్‌వర్త్ వరుసగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అంపైర్‌గా వ్యవహరించనున్నారు. అతను 2021, 2023 ఎడిషన్లలో అంపైరింగ్ చేశాడు. గఫానీ రెండోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అంపైరింగ్ చేయబోతున్నాడు.
READ MORE: India Pakistan: పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై దాడి చేసేందుకు భారత్ మాస్టర్ ప్లాన్..
గఫానీ చివరిసారిగా 2023 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అంపైరింగ్ చేశాడు. ఇక ఇంగ్లాండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో టీవీ అంపైర్‌గా వ్యవహరించనున్నారు. 2021 డబ్ల్యూటీసీ ఫైనల్‌లో కెటిల్‌బరో అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించాడు. మరోవైపు భారత్ కు చెందిన నితిన్ మీనన్ ఫోర్త్ అంపైర్‌గా వ్యవహరిస్తారు. నితిన్ తొలిసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అంపైరింగ్ చేస్తున్నాడు. భారత మాజీ ఫాస్ట్ బౌలర్ జవగళ్ శ్రీనాథ్ మ్యాచ్ రిఫరీ పాత్రలో కనిపించనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్ అఫీషియల్స్ ను ప్రకటించిన అనంతరం ఐసీసీ ఛైర్మన్ జై షా మాట్లాడుతూ.. అర్హత ఉన్న అంపైర్లనే ఎంపిక చేశాం. వారంతా తమ పాత్రకు న్యాయం చేస్తారనే నమ్మకంతోనే నియమించామని వెల్లడించారు. కాగా డబ్ల్యూటీసీ ఫైనల్‌ల్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా తలపడనున్నాయి.
