Womens T20 Worldcup 2024: భారీగా పెరిగిన మహిళల టి20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ..
- మహిళల టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 3 నుంచి యూఏఈలో.
- భారీగా పెరిగిన మహిళల టి20 ప్రపంచ కప్ ప్రైజ్ మనీ..
- పురుషులతో సమానంగా ప్రైజ్ మని.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Womens T20 Worldcup 2024: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) మహిళల T20 ప్రపంచ కప్ 2024 ప్రైజ్ మనీని ప్రకటించింది. ఈ ప్రకటనతో ఇప్పుడు పురుషులు, మహిళలకు సమాన ప్రైజ్ మనీ ఇవ్వబడుతుంది. వచ్చే నెలలో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరగనున్న మహిళల టీ20 ప్రపంచకప్‌తో ఇది ప్రారంభమవుతుంది. ఐసీసీ ప్రకటన ప్రకారం.. మహిళల టీ20 ప్రపంచకప్ గెలిచిన జట్టుకు ఇకపై 2.34 మిలియన్ యూఎస్ డాలర్లు అందుతాయి. గతేడాది దక్షిణాఫ్రికాలో ఆడిన మహిళల టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న ఆస్ట్రేలియాకు 1 మిలియన్ అమెరికన్ డాలర్ల ప్రైజ్ మనీ లభించింది. ఈ విధంగా చూస్తే ప్రైజ్ మని 134 శాతం పెరిగింది. ఈ ఏడాది అమెరికా, వెస్టిండీస్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్‌లో విజేతగా నిలిచిన భారత పురుషుల జట్టు 2.34 మిలియన్ యూఎస్ డాలర్లు ప్రైజ్ మనీని అందుకుంది.
Chiranjeevi-Suhasini: గన్‌తో వాళ్లను బెదిరించారు.. రియల్ లైఫ్‌లో కూడా చిరంజీవి హీరోనే: సుహాసిని
Also Read
- Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
- Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
- APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
- The Paradise Collections: @200 కోట్లు లోడింగ్.. నెగిటివ్ టాక్‌ను తిప్పికొట్టి 'ది పారడైస్' బాక్సాఫీస్ జోరు మాములుగా లేదుగా..!
ఐసీసీ మహిళల T20 ప్రపంచ కప్ 2024 మొదటి ఐసీసీ టోర్నమెంట్ అని తెలిపింది. దీనిలో స్త్రీలు పురుషులతో సమానంగా ప్రైజ్ మనీ పొందుతారు. ఇది ఈ క్రీడ చరిత్రలో ఒక ముఖ్యమైన విజయం అవుతుంది. ప్రకటన ప్రకారం, జూలై 2023లో జరిగిన ఐసీసీ వార్షిక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకోబడింది. 2030 షెడ్యూల్ కంటే ఏడేళ్ల ముందే ప్రైజ్ మనీని సమం చేయాలని ఐసీసీ బోర్డు నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచ కప్‌లో పురుషులు, మహిళలకు సమాన ప్రైజ్ మనీని కలిగి ఉన్న మొదటి ప్రధాన క్రీడగా క్రికెట్ అవతరించింది.
మహిళల టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 3 నుంచి యూఏఈలో జరగనుంది. ముందుగా బంగ్లాదేశ్‌లో నిర్వహించాల్సి ఉంది. అయితే అక్కడి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు మార్చింది. అక్టోబర్ 4న న్యూజిలాండ్‌తో మహిళల టీ20 ప్రపంచకప్‌లో భారత్ తన ప్రయాణాన్ని ప్రారంభించనుంది.
The stakes just got higher 🚀
Biggest-ever prize money pool announced for ICC Women’s #T20WorldCup 2024 👇https://t.co/CSuMLPjbwV
— ICC (@ICC) September 17, 2024
తాజావార్తలు
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
Kavitha: సిరిసిల్లకు సీఎం ఏం ఇచ్చారు?.. సర్కార్‌పై కవిత విమర్శలు..!
-
Cash Withdrawal Surges: ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరణలో కొత్త రికార్డు.. ఏకంగా రూ.2.24 లక్షల కోట్లు డ్రా!
-
APSRTC: ‘స్త్రీ శక్తి’లో చారిత్రాత్మక మైలురాయి.. 100 కోట్లు దాటిన ఉచిత ప్రయాణాలు
ట్రెండింగ్
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
Harmanpreet Kaur: హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన నిర్ణయం!
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!