NTV Telugu Site icon

AFG vs ENG: ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అఫ్గాన్ ప్లేయర్ రికార్డ్..

Ibrahim Zadran

Ibrahim Zadran

ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా.. బుధవారం ఇంగ్లాండ్‌, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. లాహోర్ క్రికెట్ స్టేడియంలో ఇంగ్లీష్ బౌలర్లు ఓ ఆట ఆడుకున్నాడు. అతని అద్భుతమైన ఇన్నింగ్స్‌తో కొత్త రికార్డు సృష్టించాడు. ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడి ఇబ్రహీం ఘనత సాధించాడు. 146 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 177 పరుగులు చేశాడు. ఇంగ్లాండ్ ఓపెనర్ బెన్ డకెట్ రికార్డును ఇబ్రహీం బద్దలు కొట్టాడు. డకెట్ రికార్డు 5 రోజులు కూడా నిలవలేదు. ఫిబ్రవరి 22న ఆస్ట్రేలియాపై డకెట్ 143 బంతుల్లో 165 పరుగులు చేశాడు.

ఇబ్రహీం తన వన్డే కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు చేయడమే కాకుండా.. ఆఫ్ఘనిస్తాన్ తరపున వన్డేలో అత్యధిక ఇన్నింగ్స్‌ ఆడి రికార్డు సృష్టించాడు. గతంలో కూడా ఈ రికార్డు ఇబ్రహీం పేరిట ఉండేది. పాకిస్తాన్ గడ్డపై 4వ సారి అత్యధిక పరుగుల వన్డే ఇన్నింగ్స్ ఆడిన ఘనతను ఇబ్రహీం సాధించాడు. ఇబ్రహీం.. డకెట్ (165), ఆండ్రూ హడ్సన్ (161)ల రికార్డులను బద్దలు కొట్టాడు. పాకిస్తాన్ గడ్డపై వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన రికార్డు గ్యారీ కిర్‌స్టన్ పేరిట ఉంది. దక్షిణాఫ్రికా మాజీ బ్యాట్స్‌మెన్ కిర్‌స్టన్ 1996లో రావల్పిండి మైదానంలో యుఎఈపై అజేయంగా 188 పరుగులు చేశాడు.

Read Also: China: మయన్మార్ సరిహద్దుల్లో చైనా రాడార్.. భారత్‌‌కి భద్రతా ముప్పు..

ఛాంపియన్స్ ట్రోఫీలో అతిపెద్ద ఇన్నింగ్స్ ఆడిన ఆటగాళ్లు:
177 ఇబ్రహీం జాద్రాన్ vs ఇంగ్లాండ్, లాహోర్ 2025
165 బెన్ డకెట్ vs ఆస్ట్రేలియా, లాహోర్ 2025
145* నాథన్ ఆస్లే vs USA, ది ఓవల్ 2004
145 ఆండీ ఫ్లవర్ vs ఇండియా, కొలంబో RPS 2002
141* సౌరవ్ గంగూలీ vs దక్షిణాఫ్రికా, నైరోబి 2000
141 సచిన్ టెండూల్కర్ vs ఆస్ట్రేలియా, ఢాకా 1998
141 గ్రేమ్ స్మిత్ vs ఇంగ్లాండ్, సెంచూరియన్ 2009

అఫ్గానిస్తాన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరు:
177 ఇబ్రహీం జాద్రాన్ vs ఇంగ్లాండ్, లాహోర్ 2025
162 ఇబ్రహీం జాద్రాన్ vs శ్రీలంక, పల్లకెలె 2022
151 రెహ్మాన్ రెహ్మాన్ గుర్బాజ్ vs పాకిస్తాన్, హన్బంటోట 2023
149* అజ్మతుల్లా ఉమర్జాయ్ vs శ్రీలంక, పల్లకెలె 2024
145 రెహ్మాన్ రెహ్మాన్ గుర్బాజ్ vs బంగ్లాదేశ్, చట్టోగ్రామ్ 2023