Site icon NTV Telugu

Ibomma: పేరు మార్చుకున్న ఐబొమ్మ.. కొత్త పేరు ఏంటో తెలుసా..?

Ibomma

Ibomma

Ibomma – Boppam.tv: నెట్టింట సినిమాలు చూసే ఎవరైనా సరే ఐ బొమ్మ గురించి తెలియని వారు ఉండరు. దేశంలోని ఏ భాషలో సినిమా అయినా సరే ఈ వెబ్ సైట్ ద్వారా ప్రజలు ఉచితంగా డౌన్లోడ్ చేసుకుని చూడవచ్చు. ఈ మధ్యకాలంలో సినిమా మేకింగ్ ఖర్చులు భారీగా పెరగడంతో.. చాలా సినిమాల మొదటి రెండు వారాలు పూర్తిగా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు. దింతో చాలామంది మధ్యతరగతి ప్రజలు సినిమాను థియటర్స్కు వెళ్లి చూడాలంటే భయపడిపోతున్నారు. దింతో ప్రజలు థర్డ్ పార్టీ సైట్లను ఆశ్రయించి వారికి కావాల్సిన సినిమాలను కాస్త ఆలస్యంగానైనా ఉచితంగా చూస్తున్నారు. ఇలా పుట్టుకొచ్చిన థర్డ్ పార్టీ యాప్ లలో “ఐ బొమ్మ ” సైట్ కూడా ప్రముఖమైనది.

Liquor Policy Case: రౌస్ అవెన్యూ స్పెషల్ కోర్టులో హాజరు కానున్న కవిత..

ఇకపోతే గత కొద్దీ రోజులనుండి ఈ సైట్ పేరులో మార్పు వచ్చినట్టు కనపడుతుంది. దాంతోపాటు ఈ సైట్ ను కాస్త సాంకేతికంగా అభివృద్ధి చేశారని తెలుసస్తోంది. ఇకపోతే ఐ బొమ్మకు బదులు bappam.tv అనే పేరును కొత్తగా చేర్చారు. ఇప్పుడు బప్పం టీవీ అని కొట్టగానే.. ఐ బొమ్మ సైట్ ప్రత్యక్షం అవుతోంది. కాకపోతే., ఐ బొమ్మ సైట్ గా పేరు ఉన్నప్పుడు ఏ విధంగా పేజీ ఉందొ.. ఇప్పుడు ఓపెన్ చేయగానే ఆ విధంగానే పేజ్ ఓపెన్ అవుతుంది. దాని ముందు బప్పం టీవీ అని మాత్రం కనబడుతుంది. అంతేకాదండోయ్.. హోమ్, అబౌట్, బగ్ అనే ఆప్షన్లను కూడా ఇక్కడ ఇచ్చాడు. ఇక బప్పం.టీవీ అనేది పసుపు రంగులో ఉంటే టీవీ అనేది తెలుపు రంగులో ఉంటుంది. ఇక ఈ సైట్ లో అన్ని భాషలకు సంబంధించిన సినిమాలు అందుబాటులో ఉంటాయి. ఇంకేముంది కావలసిన సినిమాను డౌన్లోడ్ చేసుకొని మనం చూసుకోవచ్చు.

Viral News: సింగిల్స్‌కు కిర్రాక్ ఆఫర్.. హగ్‌కు రూ.11, ముద్దుకు 110..

Exit mobile version