Site icon NTV Telugu

Ibomma: మీ దేశంలో పర్మనెంట్ గా మూసేస్తున్నాం.. ఐబొమ్మ మెసేజ్!

Ibomma

Ibomma

Ibomma: ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. నిన్న ఒక అడుగు ముందుకు వేసి, అతని చేతనే ఆ వెబ్‌సైట్లను మూయించేశారు పోలీసులు. అయితే తాజాగా ఐబొమ్మ వెబ్‌సైట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా.. ఆ వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. బప్పం టీవీ సైతం ఓపెన్ కాలేదు. ఐబొమ్మ వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఒక సందేశం దర్శనమిచ్చింది. అదేంటంటే.. “మీరు ఇటీవల మా గురించి విని ఉండవచ్చు, లేదా.. ఎప్పటినుంచో మా సేవలను వినియోగిస్తున్న వారై ఉండవచ్చు. కానీ మీకు ఒక చెడు వార్త చెప్పాల్సి వస్తోంది. మీ దేశంలో మేము పర్మనెంట్‌గా ఈ సేవలను నిలిపివేస్తున్నాం. దయచేసి మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం” అని ఆ తెలపడంతో ఆసక్తికరంగా మారింది.

CP Sajjanar: ఐ-బొమ్మలో 21వేల సినిమాలు.. బెట్టింగ్‌ యాప్స్‌ ప్రమోషన్‌.. రూ. కోట్లల్లో సంపాదన..

ఇమ్మడి రవి విశాఖపట్నం వాసి. అతను హైదరాబాద్‌లో మూడు కోట్ల విలువ చేసే నివాసాన్ని ఏర్పరచుకున్నాడు. కరీబియన్ దీవుల్లో నివసిస్తూ, తెలుగు సినిమాల మాస్టర్ ప్రింట్లను దొంగతనం చేసి, వాటిని పైరసీ వెబ్‌సైట్లలో పెట్టి డబ్బులు సంపాదిస్తున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న అతను భార్య నుంచి విడాకులు తీసుకునే క్రమంలో భారతదేశానికి రావాల్సి వచ్చింది. అయితే అతను ఐబొమ్మ, బప్పం టీవీలను నడుపుతున్నాడని అతని భార్య పోలీసులకు వెల్లడించడంతో, పోలీసులు అతన్ని కూకట్‌పల్లిలోని అతని నివాసంలో అదుపులోకి తీసుకున్నారు.

CP Sajjanar: రవిని పట్టుకుంటే పోలీసులపై మీమ్స్ చేయడం సరికాదు.. “మీమర్స్‌కు” సజ్జనార్ హెచ్చరిక..

Exit mobile version