Ibomma: ఐబొమ్మ, బప్పం టీవీ నిర్వాహకుడు ఇమ్మడి రవిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసింది. నిన్న ఒక అడుగు ముందుకు వేసి, అతని చేతనే ఆ వెబ్‌సైట్లను మూయించేశారు పోలీసులు. అయితే తాజాగా ఐబొమ్మ వెబ్‌సైట్ ఓపెన్ చేసే ప్రయత్నం చేయగా.. ఆ వెబ్‌సైట్ ఓపెన్ కాలేదు. బప్పం టీవీ సైతం ఓపెన్ కాలేదు. ఐబొమ్మ వెబ్‌సైట్ ఓపెన్ చేసినప్పుడు మాత్రం ఒక సందేశం దర్శనమిచ్చింది. అదేంటంటే.. “మీరు ఇటీవల మా గురించి విని…