NTV Telugu Site icon

IAS Transfer In AP: ఏపీలో భారీగా ఐఏఎస్ల బదిలీలు..

Ias

Ias

IAS Transfer In AP: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 19 మంది ఐఎఎస్ అధికారులను బదిలీ చేస్తూ సీఎస్ ఉత్తర్వులు వెల్లడించారు. జలవనరుల శాఖ స్పెషల్ సీఎస్గా జి సాయి ప్రసాద్, పంచాయితీ రాజ్ ముఖ్యకార్యదర్శిగా శశి భూషణ్, వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శిగా రాజశేఖర్, కార్మికశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా గోపాల కృష్ణా ద్వివేది, పురపాలకశాఖ ప్రత్యేక కార్యదర్శిగా అనిల్కుమార్ సింఘాల్, పౌరసరఫరాలశాఖ కమిషనర్గా సిద్ధార్థ్ జైన్, పాఠశాల కార్యదర్శిగా కోన శశిధర్, ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా సౌరభ్ గౌర్, సీఆర్డీఏ కమిషనర్ గా కాటమనేని భాస్కర్, సీఎం కార్యదర్శిగా ప్రద్యుమ్న, ఆర్థికశాఖ కార్యదర్శిగా వినయ్ చంద్, ఆర్థికశాఖ వ్యయ కార్యదర్శిగా ఎం జానకి, పశుసంవర్థకశాఖ కార్యదర్శిగా ఎంఎం నాయక్, గనుల శాఖ డైరెక్టర్ గా ప్రవీణ్ కుమార్, ఏపీఎండీసీ ఎండీగా ప్రవీణ్ కుమార్ కు అదనపు బాధ్యతలను అప్పగించిన ఏపీ ప్రభుత్వం. ఇక, శ్రీలక్ష్మీ , రజిత్ భార్గవ్, ప్రవీణ్ ప్రకాష్, మురళిధర్ రెడ్డిని జీఏడిలో రిపోర్ట్ చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Read Also: Hyderabad: విదేశాలను సిమ్ లు సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్

అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ ఎం. వెంకటేశ్వర రావును జలవనరుల శాఖ సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రెండేళ్ళ పాటు వెంకేశ్వర రావు సలహాదారుగా పదవిలో కొనసాగుతారని ఉత్తర్వుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేర్కొనింది.