Brij Bhushan: మహిళా రెజర్లు తనపై చేసిన ఆరోపణలపై జాతీయ రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ శరణ్ సింగ్ స్పందించారు. తనలో శక్తి ఉన్నంతవరకు పోరాడతానంటూ ఓ వీడియో సందేశాన్ని ఆయన విడుదల చేశారు. ఆ వీడియో తనపై వచ్చిన లైంగిక ఆరోపణల గురించి ప్రస్తావించకుండా తన నిస్సహాయతను ఎప్పటికీ అంగీకరించలేనని పేర్కొన్నాడు. మిత్రులారా అని సంభోధిస్తూ బ్రిజ్ భూషణ్ వీడియో సందేశాన్ని ఇచ్చారు. ” నేను జీవితంలో ఏం సాధించాను? ఏం కోల్పోయాను? అనే విషయాల గురించి ఆలోచించను. నేను గెలిచానా ఓడానా అని ఆత్మవిమర్శ చేసుకున్న రోజు.. తనలో పోరాడేందుకు సరిపడా శక్తి లేదని గ్రహించిన రోజు నేను నిస్సహాయుడనని భావిస్తా. అప్పుడు మరణాన్ని ఆశ్రయిస్తా.. ఎందకుంటే అలాంటి జీవితాన్ని నేను కోరుకోవడం లేదు” అని బ్రిజ్ భూషణ్ సెల్ఫీ వీడియోలో అన్నారు.
Read Also: Shirdi: మే 1 నుంచి షిర్డీ బంద్.. సీఐఎస్ఎఫ్ భద్రతపై గ్రామస్తులు సీరియస్
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. బ్రిజ్ భూషణ్ సింగ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసినా దిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయలేదని మహిళా రెజ్లర్లు మరోసారి జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. బ్రిజ్‌పై చర్యలు తీసుకునే వరకు పోరాటాన్ని ఆపేది లేదని రెజ్లర్లు స్పష్టం చేశారు. బ్రిజ్‌పై వేసిన కమిటీ తన రిపోర్టును తయారు చేసింది. కానీ ఇప్పటి వరకు ఆ రిపోర్టును బయటకు రిలీజ్ చేయలేదు. అథ్లెట్లు వీధుల్లోకి వెళ్లి ధర్నా చేయడం సరికాదు అని ఐఓఏ అధ్యక్షురాలు పీటీ ఉష అన్నారు. దీన్ని రెజ్లర్లు ఖండించారు.
VIDEO | WFI President Brij Bhushan Sharan Singh reacts to the sexual harassment charges against him. pic.twitter.com/HOdwVCWCIa
— Press Trust of India (@PTI_News) April 27, 2023