Site icon NTV Telugu

Yuvraj Singh: నేను మంచి కోచ్‌ను అవుతాను.. ఇంతకీ బీసీసీఐ ఛాన్స్ ఇస్తుందా..?

Yuvraj Singh

Yuvraj Singh

భారత జట్టుకు 2011 వరల్డ్ కప్ లో కీలక పాత్ర పోషించిన యువరాజ్ సింగ్.. ఆ టోర్నీలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. వరల్డ్ కప్ లో 362 పరుగుుల చేసి బ్యాటింగ్ లో వీరేంద్ర సెహ్వాగ్ తో(380 రన్స్) పోటీ పడ్డాడు. అయితే.. 2011 వరల్డ్ కప్ లో అత్యధిక యావరేజ్ కల్గిన టీమిండియా బ్యాటర్ యువీనే.. కుమార సంగర్కర 8 ఇన్సింగ్స్ లో 93 యావరేజ్ తో 465 రన్స్ చేస్తే.. యవీ 8 ఇన్సింగ్స్ లో 90.50 యావరేజ్ తో 362 పరుగులు చేశాడు. ఇందులో నాలుగుసార్లు నాటౌట్ గా నిలిచాడు.

Read Also: Dil Raju: దిల్ రాజు షాకింగ్ డెసిషన్.. అధ్యక్ష పదవి బరిలోకి?

అట్లాగే.. బౌలింగ్ లోను యువీ 15 వికెట్లు తీసి ముత్తయ్య మురళీధరన్, బ్రెట్ లీ, లసిత్ మలింగ, డేల్ స్టెయిన్ వంటి బౌలర్ల కంటే మెరుగైన ప్రదర్శన చేశాడు. అయితే ఫైనల్‌లో మహేంద్ర సింగ్ ధోనీ బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకోవడంతో యువరాజ్ సింగ్‌కి దక్కాల్సినంత క్రెడిట్ మొత్తం దక్కలేదన్నది అందరూ అనుకుంటున్నారు. కెరీర్ పీక్స్‌‌లో ఉన్నప్పుడే క్యాన్సర్ బారిన పడిన యువీ పూర్తిగా కోలుకున్న తర్వాత తిరిగి టీమిండియాలోకి వచ్చాడు. క్యాన్సర్‌తో పోరాడిన యువరాజ్.. బీసీసీఐ చేసిన రాజకీయ కుట్రలో మాత్రం ఓడిపోయాడు.

Read Also: Jaiveer Reddy : ఎమ్మెల్యే నోముల భగత్‌పై జానారెడ్డి తనయుడు జైవీర్ రెడ్డి హాట్‌ కామెంట్స్‌

అయితే.. యువరాజ్ సింగ్ రిటైర్మెంట్ తర్వాత గ్లోబల్ టీ20 కెనడా, అబుదాబీ టీ10 వంటి విదేశీ లీగుల్లో ఆడాడు. ఒకానొక దశలో రిటైర్మెంట్ వెనక్కి తీసుకోవాలని యువీ భావించాడు.. అయితే విదేశీ లీగుల్లో ఆడడంతో యువీ కమ్‌బ్యాక్‌కి బీసీసీఐ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తాజాగా ఓ కార్యక్రమంలో యువరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘అవును, నేను టీమిండియాకి మంచి కోచ్‌గా మారగలను.. ఆ నమ్మకం నాకుంది.. అయితే దానికి నేను బీసీసీఐ సిస్టమ్‌లో ఉండాలి.. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఆ అవకాశం వస్తుందన్న నమ్మకం ఏ మాత్రం లేదు.. నేను చేస్తానని చెప్పినా ఆ అవకాశం నాకు ఇవ్వరు’ అంటూ కామెంట్ చేశాడు.

Read Also: AP Government: వారికి ఏపీ సర్కార్‌ గుడ్‌న్యూస్‌.. ఇక, రూ.10 వేలు..

ప్రస్తుతం యువరాజ్ సింగ్ టీమిండియాలో ఫ్యూచర్ స్టార్‌గా వెలుగొందుతున్న శుబ్‌మన్ గిల్‌కి పర్సనల్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి ప్లేయర్లను కెరీర్ ఆరంభంలో ప్రొత్సహించి.. వారికి మెంటర్‌గా కూడా యువీ వ్యవహరించాడు. ఐపీఎల్‌లో కొన్ని ఫ్రాంఛైజీలు, కోచ్‌గా రావలని కోరడంతో.. అయితే ఆ టైమ్‌లో ఫుల్ టైం కోచ్‌గా వ్యవహరించేందుకు తన దగ్గర టైం లేదని యువరాజ్ సింగ్ కామెంట్ చేశాడు.

Exit mobile version