NTV Telugu Site icon

Nitish Kumar: మళ్లీ బీజేపీతో పొత్తు కంటే చావడమే మేలు.. నితీశ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు

Nitish Kumar

Nitish Kumar

Nitish Kumar: బీజేపీతో మళ్లీ కలవడంపై బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో మళ్లీ పొత్తు కంటే చావడమే మేలని ఆయన వ్యాఖ్యానించారు. కేంద్రం అధికారంలో ఉన్న బీజేపీ ఉపముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌పై ఉద్దేశపూర్వకంగా, ఆధారం లేకుండా కేసులు పెట్టిందని ఆయన ఆరోపించారు. నితీష్‌తో పొత్తు పెట్టుకోమని బీజేపీ నేతలు చెప్పడంతో నితీష్‌కుమార్ ఈ విధంగా స్పందించారు.

తనకు అలవాటైన ద్రోహం అనే అస్త్రంతో తమ నమ్మకాన్ని వమ్ము చేశాడని రాష్ట్ర బీజేపీ చీఫ్ సంజయ్ జైస్వాల్‌ ఆరోపణలు చేయగా.. ముఖ్యమంత్రి స్పందిస్తూ మరోసారి కలయిక ఊహాగానాలను తిరస్కరించారు. బీజేపీతో జతకట్టడం కంటే చనిపోవడమే మేలు అని తేజస్వీ యాదవ్ పక్కన నిలబడి ఉండగా విలేకరులతో అన్నారు. బీజేపీ నేతలు తమతో పొత్తుకోసం ఎంతో కష్టపడ్డారని.. నన్ను తమవైపు తిప్పుకోవడానికి తేజస్వీ, అతని తండ్రిపై కేసులు పెట్టారని నితీష్ కుమార్ అన్నారు.

Bharat Jodo Yatra: మంచులో రాహుల్, ప్రియాంక ఆటలు.. వీడియో వైరల్

వచ్చే ఏడాది జరగనున్న జాతీయ ఎన్నికల్లో బీహార్‌లోని 40 లోక్‌సభ స్థానాలకు గాను 36 స్థానాలు గెలుస్తామని బీజేపీ ప్రకటించడాన్ని ముఖ్యమంత్రి దుయ్యబట్టారు. బీజేపీ హిందుత్వ భావజాలం పట్ల ఎప్పుడూ జాగ్రత్తగా ఉండే ముస్లింలతో సహా తన మద్దతుదారులందరి ఓట్లను తాము మిత్రపక్షంగా ఉన్నప్పుడు బీజేపీ పొందేదని ఆయన అన్నారు.

Show comments