Site icon NTV Telugu

Car Prices Hike: కారు కొనాలనుకుంటే కోనేయండమ్మా.. మే 1 నుండి మరింత కాస్ట్లీ కాబోతున్నాయి..!

Hyundai

Hyundai

Hyundai Car Prices Hike from May 2026: కారు కొనాలని ప్లాన్ చేస్తున్నవారికి ఓ ఇంపార్టెంట్ న్యూస్. ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ హ్యుండాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) తన వాహనాల ధరలను మే 2026 నుంచి పెంచనున్నట్లు ప్రకటించింది. పెరుగుతున్న ఉత్పత్తి ఖర్చులు, ముడి సరుకు ధరలు, ఇతర ఆర్థిక ఒత్తిడుల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ తెలిపింది. ఈ ధరల పెంపు గరిష్టంగా 1% వరకు ఉండనున్నట్లు కంపెనీ పేర్కొంది.

కొత్త లుక్, అప్డేటెడ్ ఫీచర్లతో మళ్లీ మార్కెట్‌లోకి Bajaj Pulsar 180 రీలాంచ్.. ధర, ఫీచర్స్ ఇవే..!

ముఖ్యంగా ఈ ధరల పెంపు ఒక్కో మోడల్‌ కు వేరుగా ఉండబోతోందని, అయితే కంపెనీ పోర్ట్‌ఫోలియోలో ఉన్న అన్ని హ్యాచ్‌బ్యాక్‌లు, SUVలు, సెడాన్‌లకు ఇది వర్తించనుంది. మోడల్ వారీగా ఎంత మేరకు ధరలు పెరుగుతాయో త్వరలో వెల్లడించనున్నారు. ఇదే ఏడాది జనవరిలో ఇప్పటికే 0.6% ధరలు పెంచిన హ్యుండాయ్, ఇది రెండోసారి ధరల పెంపు. ఇక భారత ఆటోమొబైల్ రంగంలో ఏప్రిల్ 2026లోనే టాటా మోటార్స్, BMW, ఆడి, మెర్స్డ్స్-బెంజ్ ఇండియా వంటి ప్రముఖ కంపెనీలు ధరలు పెంచిన విషయం తెలిసిందే.

Samsung Smartphones: మళ్లీ ధరలు పెంచిన శాంసంగ్‌.. ఏ ఫోన్ ఎంత ధర పెరిగిందంటే..

విదేశీ మారక విలువల మార్పులు, మరియు ముడి సరుకు ఖర్చుల పెరుగుదల కారణంగా ‘ఆడి’ కంపెనీ ఏప్రిల్ 1 నుంచి 2% వరకు ధరలు పెంచింది. అదే విధంగా టాటా మోటార్స్ కూడా ICE మోడళ్లపై 0.5% వరకు ధరలను పెంచింది. ఇక లగ్జరీ కార్ల విభాగంలో మెర్స్డ్స్-బెంజ్ ఇండియా కూడా 2% వరకు ధరలను పెంచింది. ఇక MG మోటార్ ఇండియా కూడా తన కార్ల ధరలను 2% వరకు పెంచింది. అయితే MG సెలెక్ట్ ద్వారా అమ్మే ప్రీమియం మోడల్స్‌పై మాత్రం ఈ పెంపు ప్రభావం ఉండదని కంపెనీ స్పష్టం చేసింది.

Exit mobile version