Hyundai Alcazar Facelift 2024: హ్యుందాయ్ మోటార్ కంపెనీ తన అప్డేటెడ్ అల్కాజర్ 2024 ను సెప్టెంబర్ 9 న భారత మార్కెట్లో విడుదల చేయబోతోంది. ఈ కొత్త హ్యుందాయ్ ఆల్కజార్ 6, 7 సీటర్ కాన్ఫిగరేషన్ లలో 4 వేరియంట్ లలో అందించబడుతుంది. అవే ఎగ్జిక్యూటివ్, ప్రెస్టీజ్, ప్లాటినం, సిగ్నేచర్ మోడల్స్. కారు మొత్తం 7 కలర్ ఆప్షన్‌లు ఉంటాయి. ఈ వాహనం కోసం రూ. 25,000 బుకింగ్ టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. ఇక ఈ కార్స్ ఫుల్ డీటెయిల్స్ చూస్తే..
Aadhar Card Update: అప్పటి వరకే ఆధార్ కార్డు ఉచిత అప్డేట్.. ఆపై బాదుడే..
రాబోయే అల్కాజార్ ఫేస్‌లిఫ్ట్ లో 1.5 లీటర్ టర్బో పెట్రోల్, 1.5 లీటర్ U2 CRDi డీజిల్ ఇంజన్‌లు ఉంటాయి. టర్బో – పెట్రోల్ మోడల్ ట్రాన్స్‌మిషన్ కోసం 6- స్పీడ్ మాన్యువల్, 7- స్పీడ్ DCT గేర్ బాక్స్ తో వస్తుంది. SUV ప్లాటినం వేరియంట్ 6, 7- సీటర్ కాన్ఫిగరేషన్ లలో వస్తుంది. వీటిలో 6 సీటర్ మోడల్ టర్బో పెట్రోల్, డీజిల్ ఇంజిన్ లతో అందుబాటులో ఉంటుంది. అయితే ట్రాన్స్‌మిషన్ కోసం ఆటోమేటిక్ గేర్ బాక్స్ మాత్రమే అందించబడుతుంది. 7 సీటర్ మోడల్ మాన్యువల్, ఆటోమేటిక్ రెండు ఎంపికలలో వస్తుంది. సిగ్నేచర్ వేరియంట్ 6, 7 సీటర్ మోడల్‌లు రెండు ఇంజన్ లతో కూడిన ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో మాత్రమే అమర్చబడి ఉంటాయి. కొత్త అల్కాజార్ ధర సుమారు రూ. 17 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ కార్స్ టాటా సఫారి, మహీంద్రా XUV700 లకు పోటీగా ఉండనుంది.