NTV Telugu Site icon

HYDRA Volunteers : ట్రాఫిక్ పోలీసుల‌కు హైడ్రా వాలంటీర్ల స‌హ‌కారం..

Hydra Volunteers

Hydra Volunteers

HYDRA Volunteers : ట్రాఫిక్ పోలీసుల‌కు హైడ్రా వాలంటీర్ల స‌హ‌కారం అందివ్వనున్నారు. ట్రాఫిక్ పోలీసుల‌కు స‌హ‌క‌రించేందుకు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధమవుతున్నారు. గోషామ‌హ‌ల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో మొద‌టి విడ‌త‌గా 50 మందికి శిక్షణ ఇస్తున్నారు ట్రాఫిక్‌ అధికారులు. ఈక్రమంలో ట్రాఫిక్ క్రమ‌బ‌ద్దీక‌ర‌ణ మెలుకువ‌లు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నేర్చుకుంటున్నారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్‌లు పేరిట ముఖ్యమైన కూడ‌ళ్లు, ట్రాఫిక్ ర‌ద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసుల‌కు తోడుగా సేవ‌లు అందించనున్నారు హైడ్రా వాలంటీర్లు. ట్రాఫిక్ ర‌ద్దీ, ఇత‌ర ముఖ్య‌మైన స‌మ‌యాల్లో పోలీసుల‌కు స‌హ‌క‌రించే విధంగా హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ల సేవ‌లుంటాయ‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్‌ వివ‌రించారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్ పేరిట రేడియం జాకెట్లు వేసుకుని సేవ‌ల‌కు అందించనున్నారు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది. వ‌ర్షాలు, వ‌ర‌ద‌లు.. ఇలా ప్రకృతి వైప‌రీత్యాలు లేని స‌మ‌యంలో ట్రాఫిక్ పోలీసులకు స‌హ‌క‌రించే విధంగా హైడ్రా ఈ విధంగా నిర్ణయం తీసుకుంది. త్వర‌లో ముఖ్యమైన కూడ‌ళ్లలో విధులు నిర్వహించ‌నున్నారు హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్లు.

AP Cabinet: నవంబర్ 6న ఏపీ కేబినెట్ భేటీ.. 12న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం

Show comments