Minister Sridhar Babu: పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ళ శ్రీపాదరావు 88వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పాల్గొని, శ్రీపాదరావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. “పదిమందికి మేలు చేస్తే పది తరాలు గుర్తుంచుకోవాలి” అంటూ శ్రీపాదరావు సేవా స్ఫూర్తిని ప్రతిబింబించారు. శ్రీపాదరావు ఉమ్మడి రాష్ట్రంలో…
HYDRA Volunteers : ట్రాఫిక్ పోలీసులకు హైడ్రా వాలంటీర్ల సహకారం అందివ్వనున్నారు. ట్రాఫిక్ పోలీసులకు సహకరించేందుకు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది సిద్ధమవుతున్నారు. గోషామహల్‌లోని ట్రాఫిక్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్‌లో మొదటి విడతగా 50 మందికి శిక్షణ ఇస్తున్నారు ట్రాఫిక్ అధికారులు. ఈక్రమంలో ట్రాఫిక్ క్రమబద్దీకరణ మెలుకువలు హైడ్రా డీఆర్ఎఫ్ సిబ్బంది నేర్చుకుంటున్నారు. హైడ్రా ట్రాఫిక్ వాలంటీర్‌లు పేరిట ముఖ్యమైన కూడళ్లు, ట్రాఫిక్ రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులకు తోడుగా సేవలు అందించనున్నారు హైడ్రా వాలంటీర్లు. ట్రాఫిక్ రద్దీ, ఇతర…
ఉదయం నుండి సాయంత్రం వరకు బీజేపీ ఆధ్వర్యంలో మూసీ బాధితుల పక్షాన ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేసిన అనంతరం ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి ఎస్.కుమార్, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, రాష్ట్ర నాయకులు లంకల దీపక్ రెడ్డి, డాక్టర్ పుల్లారావు యాదవ్ లతో కలిసి నీలోఫర్ కేఫ్ కు వచ్చారు.